తమిళనాడు మంత్రి విజయ భాస్కర్ కు కరోనా పాజిటివ్

దేశంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది.ఇప్పటివరకు కరోనా కేసులు సంఖ్య 27లక్షల పైగా నమోదయ్యాయి.

 Corona Positive, Tamil Nadu, Minister, Vijaya Bhaskar-TeluguStop.com

సామాన్య ప్రజల నుంచి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు కరోనా భయం వీడటం లేదు.అన్ని రాష్ట్రాల మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు.

కొందరూ హోమ్ క్వారంటైన్ లో చికిత్స పొందుతుండగా.మరికొందరు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంటున్నారు.

మరికొందరు కరోనా నుంచి క్యూర్ అయి ప్రజా సేవలో పాల్గొంటున్నారు.

అయితే తాజాగా, తమిళనాడు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి విజయ భాస్కర్ కు కరోనా పాజిటివ్ సోకింది.

గత కొంత కాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన కరోనా పరీక్షలు నిర్వహించుకున్నాడు.మంగళవారం రిపోర్టులు రావడంతో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.దీంతో ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జాయిన్ అయి చికిత్స చేయించుకుంటున్నారు.ఈ మేరకు మంత్రి విజయ భాస్కర్ కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, ఇంటి సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

మరోవైపు ఝార్ఖండ్ ఆరోగ్యశాఖ మంత్రి బన్న గుప్త కూడా కరోనా బారిన పడ్డారు.కరోనా టెస్ట్ రిపోర్టులు రాకముందు ఆయన ఆరోగ్య శాఖ మంత్రి క్యాబినేట్ భేటీ నిర్వహించడంతో సమావేశానికి హాజరయ్యాడు.

దీంతో భేటీకి హాజరైన సీఎం, మంత్రులు హోమ్ క్వారంటైన్ చేసుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube