లవ్ అగర్వాల్ కు కరోనా పాజిటివ్..!

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది.రోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.

 Corona Positive For Love Agarwal-TeluguStop.com

ప్రభుత్వం ఎన్ని ప్రత్యేక చర్యలు తీసుకున్నప్పటికి వైరస్ తీవ్రత తగ్గడం లేదు.ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకుల్లో కరోనా భయం వెంటాడుతోంది.

ఇప్పటికి ప్రజాప్రతినిధులు బారిన పడి కోలుకున్న వారు ఉన్నారు.దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా వైరస్ తాండవం చేస్తోంది.

 Corona Positive For Love Agarwal-లవ్ అగర్వాల్ కు కరోనా పాజిటివ్..-Telugu Political News-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శ, కోవిడ్-19 మీడియా ప్రతినిధి లవ్ అగర్వాల్ కు కరోనా పాజిటివ్ వచ్చింది.ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విటర్ ఖాతా ద్వారా తెలిపారు.

కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో హోం క్వారంటైన్ లో ఉండి చికిత్స పొందుతున్నాని ఆయన పేర్కొన్నారు.తన సహచరులందరికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

భారతదేశంలో రోజుకు 60 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.ఇప్పటికి కేసులు 24 లక్షలకు చేరువలో ఉన్నాయి.

కరోనా అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాల్లో బ్రెజిల్ తర్వాతి స్థానంలో అమెరికా, బ్రెజిల్ నిలిచాయి.ఇప్పటివరకూ దేశంలో 48 వేల మంది కరోనా బారిన పడి మృత్యువాత పడ్డారు.అమెరికా కంటే భారత్ లో 2.8 శాతం కేసులు (మూడు రెట్లు) పెరుగుతున్నాయి.

#Corona #Delhi #Love Agarwal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు