కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ‌కు కరోనా !  

congress, corona , covid19 , Ghulam Nabi Azad, Azad, - Telugu Azad, Congress, Corona, Covid19, Ghulam Nabi Azad

కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్ కరోనా మహమ్మారి భారిన పడ్డట్టు తెలుస్తుంది.దీనితో ఆయన హోమ్ క్వారంటైన్‌ లో ఉన్నట్లు తెలిపారు.

TeluguStop.com - Corona Positive For Congress Senior Leader Ghulam Nabi Azad

శుక్రవారం సాయంత్రం ఆయన ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేశారు.ఇటీవల తనను కలిసిన వారందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వెంటనే కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

ఆజాద్ కి ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది.

TeluguStop.com - కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ‌కు కరోనా -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

‘నేను కరోనా పరీక్షలు నిర్వహించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

హోమ్ క్వారంటైన్ ‌లో ఉన్నాను.ఇటీవల నన్ను కలిసిన వారందరూ దయచేసి కరోనా ప్రోటోకాల్ ప్రకారం జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను’ అని ఆజాద్ ట్వీట్ చేశారు.

ఇక దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది.సామాన్యుల నుండి ప్రముఖులు , రాజకీయ నాయకులు అందరూ కూడా కరోనా భారిన పడుతున్నారు.దేశంలో కొత్తగా మరో 63,371 కేసులు నమోదయ్యాయి.దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 73,70,469కి చేరింది.

ఇప్పటికే ఉపరాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రి సహా మరికొందరు కేంద్రమంత్రులు, పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఈ వైరస్‌ బారినపడి కోలుకున్న విషయం తెలిసిందే.

#Congress #Azad #COVID19 #Corona

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Corona Positive For Congress Senior Leader Ghulam Nabi Azad Related Telugu News,Photos/Pics,Images..