ముఖ్యమంత్రి కుటుంబసభ్యులకు కరోనా పాజిటివ్

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది.వైరస్ కట్టడికి ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి.

 Tripura, Cm Family, Corona Virus-TeluguStop.com

టెస్టుల నిర్వహణలోనూ.మెరుగైన వైద్యం అందించడంలోనూ సకల ప్రయత్నాలు చేస్తోంది.

కానీ ప్రజలు మాస్కుల ధరించకుండా గుంపులుగుంపులుగా తిరుగుతున్నారు.దీంతో వైరస్ ఒకరి నుంచి మరోకరిని సంక్రమిస్తోంది.

ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులకు ఈ బాధ తప్పడం లేదు.ఇప్పటివరకు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు వైరస్ బారిన పడుతున్నారు.

చికిత్స పొందుతూ వైరస్ నుంచి క్యూర్ అవుతున్నారు.

తాజాగా త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంట్లో కరోనా కలకలం సృష్టిస్తోంది.

సీఎం విప్లవ్ కుమార్ దేవ్ కుటుంబసభ్యుల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది.దీంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సీఎం ట్విటర్ ద్వారా వెల్లడించారు.

గత కొద్ది రోజులుగా కరోనా లక్షణాలు కనిపించడంతో కరోనా యాంటిజెన్ ర్యాపిడ్ టెస్టులు చేసుకున్నారని, రిపోర్టుల్లో పాజిటివ్ వచ్చిందని డాక్టర్లు నిర్ధారించడంలో వారిని కోవిడ్ ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు.తాను కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు ఆయన తెలిపారు.

రిపోర్టు ఇంకా రాలేదని తెలిపారు.ప్రజలు కూడా కరోనాపై అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించి ఇళ్లలోనే ఉండాలని సూచించారు.

బయటకు వెళ్లినప్పుడు మాస్కులతో పాటు సామాజిక దూరం పాటించాలని అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube