కస్తూర్బా స్కూల్ లో 53 మందికి కరోనా..!

ఏపీలో కరోనా విలయతాండవం చేస్తుంది.రోజు రోజుకీ అక్కడ కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి.

 Corona Positive For 53 Kastuba Gandhi Students At Adoni-TeluguStop.com

ఆదివారం రోజు కర్నూలు జిల్లా అదోని లో ఉన్న కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో కరోనా కేసులు వచ్చాయి.గురుకుల విద్యాసంస్థలో 300 మందికి టెస్టులు చేయగా వారిలో 53 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది.

ఈ విషయంపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల నాని ప్రత్యేక దృష్టి పెట్టారు.గురుకుల విద్యాలయంలో కరోనా కేసుల గురించి వెంటనే స్పందించిన మంత్రి ఆళ్ల నాని అక్కడే వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ఇతర విద్యార్ధినులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.

 Corona Positive For 53 Kastuba Gandhi Students At Adoni-కస్తూర్బా స్కూల్ లో 53 మందికి కరోనా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కస్తూర్భా స్కూల్ లో కొద్దిరోజుల క్రితం 23 మందికి కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది.అయితే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే ఈసారి ఆ సంఖ్య డబుల్ అయ్యింది.53 మందికి కరోనా రావడంతో స్కూల్ ను మూసేశారు.కరోనా మళ్లీ ఉదృతంగా మారుతుంది.

గురుకుల పాఠశాలల్లో హాస్టల్స్ లో ఉంటున్న వారికి కరోనా రావడం అందరికి షాక్ ఇస్తుంది.ఆంక్షలను విధించినా సరే ప్రజల జాగ్రత్త వహిస్తే తప్ప కరోనా నుండి బయటపడే అవకాశం కనిపించట్లేదు.

ఓ పక్క రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతుంది.

#53Kastuba #COvid #Adoni #Karnool #Positive

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు