ఆ రాష్ట్రంలో 70 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య… ఇలా అయితే కష్టమే…  

Corona Positive Cases 70000 Mark Maharashtra - Telugu 70000 Mark, Corona Positive Cases, Corona Virus Cases, Maharashtra State, Mumbai

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయ తాండవం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.దీంతో పలు దేశాలు ఇప్పటికే లాక్ డౌన్ విధించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తులు చేస్తున్నారు.

 Corona Positive Cases 70000 Mark Maharashtra

అయినప్పటికీ జనాలు మాత్రం వినకుండా ఏదో ఒక సాకు పేరుతో రోడ్లపై విచ్చల విడిగా తిరుగుతున్నారు.దీంతో తాజాగా మహారాష్ట్ర కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 70 వేల మార్కు దాటింది.

దీంతో పలువురు నిపుణులు ఇలా రోజురోజుకీ కరోనా వైరస్ కేసులు పెరుగుతూ పోతే భవిష్యత్తును అంచనా వేయడం కష్టతరమని అంటున్నారు.మరికొందరు మాత్రం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ లో సడలింపులు చేపడుతూ తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగానే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయని కాబట్టి ఇప్పటికైనా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని కరోనా వైరస్ పరిస్థితులు అదుపులోకి వచ్చేంతవరకు రాష్ట్రంలో సంపూర్ణ  లాక్ డౌన్ చేపట్టాలని కోరుతున్నారు.

ఆ రాష్ట్రంలో 70 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య… ఇలా అయితే కష్టమే…-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఇప్పటి వరకు మహారాష్ట్ర రాష్ట్రంలో నమోదయినటువంటి కరోనా పాజిటివ్ కేసులో గణాంకాలను పరిశీలిస్తే ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 70,013 కేసులు నమోదు కాగా 30 వేల పైచిలుకు మంది విజయవంతంగా కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్నారు.మరో 2300 పైచిలుకు మంది మృత్యువాత పడ్డారు.

కాగా ప్రస్తుతం మహారాష్ట్రలో 35 వేల పైచిలుకు కరోనా పాజిటివ్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.దీంతో రాష్ట్ర ప్రజలు బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటివరకు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కంటే మహారాష్ట్ర రాష్ట్రంలోని ఎక్కువగా కరోనావైరస్ ప్రభావం ఉన్నట్లు తెలుస్తోంది.దీంతో పలువురు వైద్యాధికారులు మరియు ప్రభుత్వ అధికారులు రాష్ట్రంలోని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

అంతేగాక ఎప్పటికప్పుడు కరోనా వైరస్ పరిస్థితులపై అవగాహన కల్పిస్తూ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Corona Positive Cases 70000 Mark Maharashtra Related Telugu News,Photos/Pics,Images..

footer-test