ఒక్కరోజులో 10 వేల కేసులు...అమెరికాలో కరోనా విలయతాండవం..!!!  

Corona Positive America Covid19 - Telugu America, Corona Positive, Coronavirus, Covid19, Masks, Sanitizers

అగ్ర రాజ్యం లేదు ఆవకాయ బద్దా లేదు అసలు కరోనాకి వాడు వీడు లేదు.ఎంట్రీ ఇచ్చిందంటే చాలు అక్కడి పరిస్థితులు తల్లకిందులు అయిపోతాయి.

 Corona Positive America Covid19 - Telugu Coronavirus Masks Sanitizers

కరోనా మా దరిచేరదు అని స్టేట్మెంట్ ఇచ్చినంత సేపు పట్టలేదు అమెరికాలోకి ఎంట్రీ ఇవ్వడానికి.పోటీ కరోనా వచ్చింది కదాఅని జాగ్రత్తలు తీసుకున్నారా అది కూడా లేదు దాంతో ఇప్పుడు అమెరికా భారీ మూల్యం చెల్లించుకుంటోంది.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధిత దేశాలలో మూడవ స్థానంలో నిలిచినా అమెరికాలో కేవలం 24 గంటల వ్యవధిలోనే 10వేల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
ప్రస్తుతం కొత్తగా వచ్చిన పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం 49,600 మందికి కరోనా సోకింది.

 Corona Positive America Covid19 - Telugu Coronavirus Masks Sanitizers

కేవలం ఒక్క రోజులో సుమారు 130 మందికి పైగా మృతి చెందారు.దాంతో అమెరికాలో మృతుల సంఖ్య 622 కి చేరుకుంది.ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా 17,000 మందికి ప్రజలు మృతి చెందారని అంచనాలు వేస్తున్నారు.అయితే అమెరికాలో అత్యధికంగా న్యూయార్క్, కాలిఫోర్నియా రాష్ట్రాలలో ఈ కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.

ఇదిలాఉంటే కరోనా కేసులు రోజు రోజుకి ఉదృతం అవుతుంటే అక్కడ శానిటైజేషన్ , మాస్కులు దొరకక ఇబ్బందులు పడుతున్నారు.ఇదే అదునుగా బ్లాక్ మార్కెట్ లో మాస్కులు, శానిటైజేషన్ పై అధిక ధరలకి అమ్ముతున్న వారిపై ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నారు.అక్రమ నిల్వలు చేసేవారిపై కటినమైన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీచేశారు.ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలకి మందులు, మాస్కులు పంపిణీ చేస్తోంది అమెరికా ప్రభుత్వం.

తాజా వార్తలు

Corona Positive America Covid19 Related Telugu News,Photos/Pics,Images..