కరోనా మహమ్మారి రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తోంది.ఒకవైపు కేసులు పెరుగుతుండడంతో పాటు, మరోవైపు మరణాల రేటు కూడా పెరుగుతోంది.
కరోనా మహమ్మారి గురించి ప్రజల్లో భయం తగ్గుతున్నప్పటికీ ఈ వ్యాధి మరింత వ్యాపించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.ఈ మహమ్మారిని తరిమికొట్టాలని అన్ని దేశాల శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కోసం తీవ్ర ప్రయత్నాలు జరుపుతూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే కరోనాకు సంబంధించి మరికొన్ని షాకింగ్ విషయాలను శాస్త్రవేత్తలు బయటపెట్టారు.
ఒకసారి కరోనా సోకిన తరువాత నెగెటివ్ వచ్చిన వ్యక్తుల ఊపిరితిత్తులలో కరోనా వైరస్ ప్రభావం కొద్దిరోజుల పాటు ఉంటుందని శాస్త్రవేత్తలు తెలియజేశారు.
జెనాన్ అనే గ్యాస్ సహాయంలో ఎం.ఆర్.ఐ స్కాన్ చేసి శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలను నిర్వహించారు.ఈ పరిశోధనలో భాగంగా 19 సంవత్సరాల వయసు నుంచి 69 సంవత్సరాల వయసున్న వారిలో దాదాపు పది మందిపై ఈ పరిశోధనలు నిర్వహించారు.
వీరిలో 8 మంది కొన్ని నెలల పాటు శ్వాసకోశకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

కరోనా నుంచి కోలుకున్న కూడా భవిష్యత్తులో మరిన్ని ఊపిరితిత్తుల సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు ఈ సందర్భంగా నిపుణులు తెలిపారు.అయితే యుక్తవయసు వారి కన్నా, వయసు పైబడిన వారిలో ఈ సమస్య తీవ్రతరం అవుతుందని తెలిపారు.ఇప్పటికే వ్యాక్సిన్ కోసం పలు ఫార్మా కంపెనీలు నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ విజయవంతం అయ్యాయి.
త్వరలోనే ఈ మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటు లోకి వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.అందుబాటులోకి వచ్చిన ఈ వ్యాక్సిన్లను ఉపయోగించి కొంత వరకు ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చని శాస్త్రవేత్తలు ఈ సందర్భంగా తెలియజేశారు.
కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు ప్రజలు తగినన్ని జాగ్రత్తలు పాటిస్తూ, కరోనా బారిన పడకుండా జాగ్రత్త గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.