మరో ఇరకాటంలో ట్రంప్…293 ప్రాణాలు గాలిలో..  

293 Americans have died after taking hydroxychloroquine for COVID-19, COVID-19, hydroxychloroquine, Side Effects, Donald Trump, Americans, Corona patients - Telugu 293 Americans Have Died After Taking Hydroxychloroquine For Covid-19, Americans, Corona Patients, Covid-19, Donald Trump, Hydroxychloroquine, Side Effects

కరోనా మహమ్మారి అమెరికా వ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న సమయంలో కరోనాని కట్టడి చేయగలిగేది కేవలం హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రమేనని ఈ మందుపై తనకి ఎంతో విశ్వాసం ఉందని ఇది మాత్రమే కరోనా నుంచీ అందరిని బయటపడేయగలదని గట్టిగా వాదించారు.దాంతో ఈ మందుని భారత్ నుంచీ పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకున్నారు.

TeluguStop.com - Corona Patients Donald Trump Hydroxychloroquine Side Effects

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

అంతేకాదు అమెరికా వ్యాప్తంగా ఎంతో మంది కరోనా రోగులకి ఈ మందు ద్వారా వైద్య పరీక్షలు చేయించారు.అయితే చాలా మందికి ఈ మందు వాడటం వలన గుండె సంభందిత రోగాలు వచ్చి చనిపోవడంతో వైద్యులు ఈ ఔషధం వాడకంపై అభ్యంతరం తెలిపారు.అయితే…

TeluguStop.com - మరో ఇరకాటంలో ట్రంప్…293 ప్రాణాలు గాలిలో..-Telugu NRI-Telugu Tollywood Photo Image

ట్రంప్ అభ్యర్ధనతో అమెరికా వచ్చిన ఈ ఔషధం కేవలం ఆరు నెలల కాలంలో సుమారు 293 మంది అమెరికన్స్ ని పొట్టనబెట్టుకుందని మిల్వాకీ జనరల్ సెంటినెల్ అధ్యయనంలో తేలింది.సైడ్ ఎఫ్ఫెక్ట్స్ వలన చనిపోయిన వారి వివరాలు ప్రకటించిన ఫుడ్ అండ్ డ్రగ్స్ వారి వివరాల ప్రకారం ఈ అధ్యయనం చేసినట్టుగా మిల్వాకీ తెలిపింది అయితే ఎంతో మంది వైద్య నిపుణులు హైడ్రాక్సీ క్లోరోక్విన్ వలన సైడ్ ఎఫ్ఫెక్స్ ఉంటాయని ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు.

అయినా సరే ట్రంప్ మాత్రం ఈ డ్రగ్స్ వాడటం వలన ఎలాంటి హాని ఉండదని ప్రకటించి మరీ అమెరికాకి తీసుకువచ్చారని పలువురు వైద్యులు ఆరోపణలు చేస్తున్నారు.ఇదిలాఉంటే

హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందును మలేరియా చికిత్స కి మాత్రమే వాడుతారు అలాగే గుండె సంభందిత వ్యాధులు , ఇతర ఆరోగ్య సమస్యలు ఉండేవారికి వీటిని ఉపయోగించరు.కానీ డాక్టర్లకి ఈ మందులు వాడమని ఆదేశాలు రావడంతో కరోనా వ్యాధి గ్రస్తులకి ఈ ఔషధాన్ని వాడటం మొదలు పెట్టారు.దాంతో ఎంతో మంది రోగులకి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ రావడంతో మరణించినట్టుగా తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ ఔషధం వాడకాన్ని నిలిపివేసినా ట్రంప్ ఒత్తిడి కారణంగానే ఈ మందును రోగులకి ఉపయోగించాల్సి వచ్చిందని కేవలం ట్రంప్ కారణంగానే ఇంతమంది మృతి చెందారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.దాంతో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ట్రంప్ మరోసారి సరికొత్త ఇరకాటంలో ఇరుకున్నారని అంటున్నారు పరిశీలకులు.

#Side Effects #Americans #Corona Patients #293Americans #Donald Trump

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Corona Patients Donald Trump Hydroxychloroquine Side Effects Related Telugu News,Photos/Pics,Images..