కామన్ బాత్ రూమ్ వాడిన కరోనా పేషేంట్,ఆందోళన చెందుతున్న జనాలు

దుబాయ్ నుంచి తెలంగాణా కు వచ్చిన ఒక యువకుడికి కరోనా వైరస్ వచ్చిన విషయం తెలిసిందే.దీనితో అతడిని హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రి లో ప్రత్యేక ఐసోలేటెడ్ వార్డు లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు.

 Corona Patient Used Common Bathroom In Gandhi Hospital-TeluguStop.com

అయితే ఒకపక్క చైనా తో పాటు ప్రపంచ దేశాలకు వణికిస్తున్న ఈ కరోనా వైరస్ భారత్ కు కూడా రావడం తో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.అయితే హైదరాబాద్ తో పాటు ఢిల్లీ లో కూడా ఒక కరోనా కేసు నమోదు అయినట్లు తెలుస్తుంది.

అయితే ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేటెడ్ వార్డులో చికిత్స పొందుతున్న ఆతను బాత్ రూమ్ కి వెళ్లేందుకు జనరల్ పబ్లిక్ వెళ్లే కామన్ బాత్ రూమ్ కి వెళ్లినట్లు తెలుస్తుంది.అయితే ఈ కరోనా వైరస్ ను అరికట్టాలి అంటే ఐసోలేటెడ్ వార్డులోనే వైద్యం అందించాల్సి ఉంటుంది.

ఎందుకంటే ఇది ఒకరి నుంచి మరొకరికి పాకుతుంది కాబట్టి.అయితే ఐసోలేటెడ్ వార్డు లో బాత్ రూమ్ లేకపోవడం తో అతడు కామన్ బాత్ రూమ్ వాడుకున్నాడు.

దీనితో అక్కడ తీవ్ర అలజడి నెలకొంది.కామన్ బాత్ రూమ్ లోకి అసలు కరోనా పేషేంట్ కు ఎలా పంపిస్తారు అంటూ అక్కడి వారంతా గగ్గోలు పెడుతున్నారు.

జరిగిన ఘటనపై అధికారులు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు.ఐసోలేషన్ వార్డులో బాత్ రూమ్ సదుపాయం లేదని అధికారులు ప్రభుత్వానికి తెలిపినట్లు తెలుస్తుంది.

కరోనా వైరస్ వచ్చి మూడు నెలలు అవుతున్నా ఇప్పటికీ ఐసోలేషన్ వార్డులో బాత్‌రూమ్ ఏర్పాటు చేయకపోవడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది.మరోపక్క ప్రభుత్వం మాత్రం ఈ కరోనా ను అరికట్టడమా కోసం ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయడం తో పాటు తాజాగా మరింత కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube