దేశంలో కరోనా కొత్త కేసులు @ 86,052  

india, corona, positive cases, deatsh - Telugu Corona, Deatsh, India, Positive Cases

దేశంలో కరోనా కేసులు రోజూ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి.రోజూ 80వేలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.

TeluguStop.com - Corona New Cases In The Country 86052

ప్రభుత్వం ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నప్పటికీ కరోనా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు.దీంతో దేశ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ వైరస్ తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులో సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు అందించారు.ఇప్పటికే చాలా మంది ప్రజలు కరోనా బారిన పడి హోం క్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు.

TeluguStop.com - దేశంలో కరోనా కొత్త కేసులు @ 86,052-General-Telugu-Telugu Tollywood Photo Image

వైరస్ తీవ్రత అధికంగా ఉన్నవారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.ప్రభుత్వాలు కూడా కోవిడ్ కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాయి.

కరోనా వ్యాక్సిన్లకు సంబంధించి క్లినికల్ ట్రయల్స్ చివరిదశలో ఉన్నాయి.పూర్తి స్థాయి టీకా అభివృద్ధిలో వచ్చేంతవరకూ కరోనా జయించడం కష్టమని పలువురు పేర్కొంటున్నారు.

తాజాగా దేశ ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది.గడిచిన 24 గంటల్లో 86,052 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 58,18,571కు చేరింది.కేసులు అధికంగా నమోదవడంతో సరికొత్త రికార్డును మళ్లీ తిరగరాసింది.

నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 1,141 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.దీంతో ఇప్పటివరకూ కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 92,290కి చేరింది.

ప్రస్తుతం దేశంలో 9,70,116 యాక్టివ్ కేసులున్నాయి.ఇప్పటివరకూ 47,56,165 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 13,80,000ల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు, ఇంత పెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహించడం ఇదే మొదటిసారని కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ వెల్లడించింది.

#Deatsh #Corona #Positive Cases #India

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Corona New Cases In The Country 86052 Related Telugu News,Photos/Pics,Images..