తెలంగాణలో కరోనా కొత్త కేసులు @ 2,296

తెలంగాణలో కరోనా కేసులు విజృంభణ కొనసాగుతూనే ఉంది.రోజూ రెండు వేలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదవుతూనే ఉంది.

 Telangan, Corona, Positive Cases, Deaths-TeluguStop.com

వైరస్ తీవ్రత పెరిగినా ప్రజల్లో మార్పు రావడం లేదు.కరోనా నింబంధనలను గాలికి వదిలేశారు.

మాస్కులు ధరించకుండా, సామాజిక దూరం పాటించకుండా తిరుగుతున్నారు.పోలీసు అధికారులు కూడా చూసి చూడనట్లు వదిలేస్తున్నారు.

దీంతో కేసులు ఒకరి నుంచి మరొకరికి కరోనా వ్యాప్తి చెందుతోంది.కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

తాజాగా తెలంగాణ ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది.గడిచిన 24 గంటల్లో 2,296 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన కేసుల సంఖ్య 1,77,070కి చేరింది.నిన్న ఒక్కరోజే 10 మంది కరోనా బారిన పడి ప్రాణాలు విడిచారు.

దీంతో వీరి సంఖ్య 1,062కి చేరింది.ప్రస్తుతం రాష్ట్రంలో 29,873 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఇప్పటివరకూ 1,46,135 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు.తాజాగా కొన్ని జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు.

హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో 321, రంగారెడ్డి జిల్లాలో 217, మేడ్చల్ మల్కాజిగిరిలో 173 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.కరోనా కేసులు పెరిగినా రాష్ట్రంలో రికవరీ రేటు అధికంగా ఉందని, దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 81.23 ఉండగా.తెలంగాణలో 82.52 శాతంగా ఉందని తెలంగాణ ఆరోగ్యశాఖ వెల్లడించింది.భారత్ లో మరణాల రేటు 1.59 శాతం ఉండగా.తెలంగాణ 0.59 శాతంగా ఉందన్నారు.కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా నిబంధనలు పాటించాలని ఆరోగ్యశాఖ సూచించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube