కరోనా వచ్చినా బాగానే ఉన్నానంటున్న మెగాస్టార్….  

Amitabh bachchan, bollywood megastar, health news, Corona Virus effect, Covid-19 - Telugu Amitabh Bachchan, Bollywood Megastar, Corona Virus Effect, Covid-19, Health News

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సృష్టిస్తున్న కలకలం గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ కరోనా ధాటికి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా వేల సంఖ్యలో మృతి చెందగా లక్షల సంఖ్యలో ఇప్పటికీ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.

 Amitabh Bachchan Health News Corona Virus

కరోనామహమ్మారి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇంట్లో కూడా కలకలం సృష్టించింది.అంతేగాక  అమితాబ్ బచ్చన్ కొడుకు, కోడలు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, మనవరాలు ఆరాధ్య కి కూడా సోకింది.

దీంతో బిగ్ బీ అభిమానులు కొంతమేర ఆందోళన చెందుతున్నారు.

కరోనా వచ్చినా బాగానే ఉన్నానంటున్న మెగాస్టార్….-Latest News-Telugu Tollywood Photo Image

అయితే తాజాగా ఈ విషయంపై అమితాబ్ బచ్చన్ స్పందించాడు.

ఇందులో భాగంగా తాను కరోనా వైరస్ సోకినప్పటికీ నానావతి ఆసుపత్రిలో వైద్యుల సంరక్షణలో బాగానే ఉన్నానని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభిమానులకి సూచించాడు.అలాగే తాను కరోనా వైరస్ నుంచి తొందరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నటువంటి అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు.

అయితే అమితాబ్ బచ్చన్ కి కరోనా వైరస్ పాజిటివ్ అని తెలియడంతో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెంటనే స్పందించి ఆయన గృహంలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి మరియు కుటుంబ సభ్యులకు అలాగే  సన్నిహితులకు వెంటవెంటనే కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిపారు.

అలాగే అమితాబచ్చన్ సందర్శించిన ప్రదేశాలను గుర్తించి వాటిని కంటోన్మెంట్ జోన్లుగా ప్రకటించారు.

ఈ విషయం ఇలా ఉండగా అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ ముంబైలోని ప్రముఖ వైద్య ఆస్పత్రి అయినటువంటి నానావతి ఆసుపత్రిలో ఉండగా ఐశ్వర్య రాయ్ మరియు ఆరాధ్య మాత్రం ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నారు.

#COVID-19

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Amitabh Bachchan Health News Corona Virus Related Telugu News,Photos/Pics,Images..