రాజకీయ నోళ్లను మూసేసిన కరోనా మాస్క్ లు ?  

Corona Masks That Shut Politicians Mouths Lock Down - Telugu Ap Local Body Elections, Corona Masks, Lock Down, Politicians Mouths

రాజకీయం అంటే రాజకీయమే.మంచి అయినా, చెడు అయినా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడమే రాజకీయ నాయకుల ముఖ్య విధి అన్నట్టుగా వ్యవహారం ఉండేది.

 Corona Masks That Shut Politicians Mouths Lock Down - Telugu Ap Local Body Elections

ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు, వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ రాజకీయం అంటే ఇంతే కదా అన్నట్టుగా నాయకులు వ్యవహరిస్తూ ఉండేవారు.మిగతా రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా వ్యవహారం ఎక్కువగా కనిపించింది.

రాజకీయ ప్రత్యర్దులే కాకుండా, సొంత పార్టీ నాయకులను కూడా విమర్శించుకుంటూ తెలంగాణలో రాజకీయ నాయకుల వ్యవహార శైలి ఉండేది.ఇక ఏపీలో అయితే టిడిపి వర్సెస్ వైసీపీ అన్నట్టుగా నాయకుల మధ్య విమర్శల బాణాలు దూసుకొస్తూ ఉండేవి.

 Corona Masks That Shut Politicians Mouths Lock Down - Telugu Ap Local Body Elections

ఇలా ఎవరికి వారు రాజకీయ రచ్చ చేస్తూ తెలుగు రాష్ట్రాలలో వేడి పెంచుతూ ఉండేవారు.ఇక ఏపీలో అయితే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం పై ఏపీ అధికార పార్టీ వైసిపి తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది.

సాక్షాత్తు రాజ్యాంగ పదవిలో ఉన్న ఎన్నికల కమిషనర్ సైతం వ్యక్తిగతంగానూ, కులం పేరుతో విమర్శలు సైతం చేశారు.ఇలా రాజకీయ రచ్చ జరుగుతుండగానే కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విజృంభించడం, భారతదేశంలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువ అవ్వడంతో మొత్తం అన్ని వ్యవహారాలు సద్దుమణిగి పోయాయి.

దేశం మొత్తం కర్ఫ్యూ వాతావరణం నెలకొనడంతో పాటు ప్రజల ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు సాహసం చేయడం లేదు.ఈ నేపథ్యంలో మొత్తం కరోనా గురించే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

రాజకీయ సందడి కనిపించడం లేదు.

ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్న నాయకులు కూడా ఇప్పుడు నోటికి మాస్క్ లు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇప్పుడు కరోనా అంశం గురించి తప్ప మారే ఇతర అంశాల గురించి నోరు మెదపడం లేదు.కరోనా వైరస్ రాజకీయ నేతల విషయంలో మాత్రం వారి నోరు మూత పడేలా చేసింది.

ప్రస్తుతం రాజకీయ నాయకులు, ప్రజలు ఇలా అందరూ కరోనా గురించి తప్ప మారే ఇతరం అంశం గురించి కూడా మాట్లాడేందుకు ఆసక్తి చూపించడంలేదు.నిత్యం కరోనా వార్తలు గురించి తెలుసుకునేందుకు మాత్రమే ఆసక్తి చూపిస్తున్నారు తప్ప, మారే ఇతర అంశాల గురించి ఎవరూ మాట్లాడడంలేదు.

దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో నిశబ్ద వాతావరణం అలుముకుంది.

తాజా వార్తలు

Corona Masks That Shut Politicians Mouths Lock Down Related Telugu News,Photos/Pics,Images..