మరీ ఇంత బలుపు ఉండవద్దు బాబాయి, రోడ్డుపై షికారు చేసిన వ్యక్తికి బుద్ది చెప్పిన పోలీసులు

కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ను ప్రకటించిన విషయం తెల్సిందే.ఈ నేపథ్యంలో జనాలు అత్యవసరాలకు తప్ప బయటకు రావద్దని, వచ్చినా కూడా కేవలం ఒక్కరు మాత్రమే రావాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన విషయం తెల్సిందే.

 Corona Lockdown Roads Selfie Video-TeluguStop.com

ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కూడా స్వచ్చందంగా జనాలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు.కాని ఒక్కరు ఇద్దరు మాత్రం తీటతో, దూలతో రోడ్ల పైకి వస్తున్నారు.

వారిలో కొందరికి పోలీసులు తీట తీర్చుతూ వాయగొడుతూ ఉండగా కొందరు మాత్రం తప్పించుకు తిరుగుతున్నారు.

తాజాగా మహారాష్ట్రకు చెందిన ఒక ముస్లీం వ్యక్తి రోడ్డుపై టూ వీలర్‌లో ప్రయాణిస్తూ ఒక సెల్ఫీ వీడియో తీసుకోవడం జరిగింది.

ఆ సెల్ఫీ వీడియోలో అతడు మాట్లాడుతూ రోడ్లపై అంతా నిర్మానుశంగా ఉంది.జనాలు ఎవరు లేరు.మేము అరటి పండ్ల కోసం బయటకు వచ్చాం.సరదాగా ఇలా తిరుగుతుంటే బాగుంది అంటూ అతడు నోటికి వచ్చిట్లుగా వాగేశాడు.

అతడే కాకుండా ఒక చిన్న పిల్లాడిని కూడా తన వెంట తీసుకుని వెళ్లాడు.మామూలుగా బండి తోలుతూ ఫోన్‌ మాట్లాడటం నేరం.

అలాంటిది బండి నడుపుతూ సెల్ఫీ వీడియో తీసుకోవడం చాలా పెద్ద నేరం.

Telugu Coronavirus, Lockdown, Roads, Selfie-Latest News - Telugu

ఈ సమయంలో బయటకు వెళ్లడం మరింత పెద్ద నేరం.అది కూడా అరటి పండ్ల కోసం అంటూ బయటకు వెళ్లడంతో అతడిపై పోలీసులు కన్ను వేశారు.అతడు పోస్ట్‌ చేసిన వీడియో ఆధారంగా అతడిని గుర్తించిన పోలీసులు పోలీస్‌ స్టేషన్‌కు తీసుకు వెళ్లారు.

తమదైన శైలిలో ఈ ముస్లీం బాబాయికి బుద్ది చెప్పి ఆ తర్వాత చెంపలు వేయించుకుని తాను చేసింది తప్పని కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితం అవ్వాలంటూ అతడితో చెప్పించి పంపించారు.అతడి వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube