అమెరికాలో దడ పుట్టిస్తున్న కరోనా తాజా లెక్కలు..మొదటి వేవ్ కంటే దారుణమా..??

అగ్ర రాజ్యం అమెరికాకు కరోనా పేరు చెప్తే వెన్నులో వణుకు పుట్టుకొస్తుంది.దాదాపు అన్ని దేశాల పరిస్థితి అలానే ఉన్నా అమెరికాకు మాత్రం ఇది ప్రత్యేకం ఎందుకంటే కేవలం అగ్ర రాజ్యంపై మాత్రమే మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉంటోంది.

 Corona Latest Figures That Are Causing Palpitations In America Is It Worse Than-TeluguStop.com

అందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి.ప్రభుత్వం విధించే నిభందనలు కొందరు ప్రజలు పాటించక పోవడం, మాస్క్ లు లేకుండా తిరగడం ఇలాంటి ఎన్నో కారణాలు అమెరికా పై కరోనా ప్రభావాన్ని చూపుతున్నాయి.

అయితే కరోనా మొదటి వేవ్ లో దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంది ఎలాగోలా బయటపడిన అమెరికా సెకండ్ వేవ్ సమయానికి ఎంతో కొంత ఊపిరి పీల్చుకోగా, థర్డ్ వేవ్ డెల్టా కి మాత్రం తలవంచక తప్పదని తాజా లెక్కలు తేటతెల్లం చేస్తున్నాయి.అంతేకాదు థర్డ్ వేవ్ భవిష్యత్తులో తీవ్ర రూపం దాల్చుతుందని మొదటి వేవ్ ను తట్టుకోలేక పోయిన అమెరికా అంతకంటే ఎక్కువగా ప్రభావం చూపనున్న డెల్టా ను ఏ విధంగా ఎదుర్కోగలదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిపుణులు.తాజాగా

Telugu America, Corona, Coronalatest, Delta, Days, Wave-Telugu NRI

అమెరికాలో 24 గంటలలో దాదాపు 1.3 లక్షల కేసులు నమోదు అయ్యాయని, గడించిన జూన్ నెలలో రోజు వారి కేసుల సంఖ్య 11 వేలుగా ఉండేదని, కానీ ప్రస్తుతం ఈ కేసుల సంఖ్య రోజుకు 80 వేల నుంచీ లక్షకు పైగా చేరుకుంటున్నాయని, ఈ పెరుగుదల ఆందోళన కలిగించే విషయమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అంతేకాదు మొదటి వేవ్ సమయంలో రోజుకు లక్ష కేసులు నమోదు అవ్వడానికి సుమారు 9 నెలలు సమయం పట్టిందని, కానీ ఇప్పుడు కేవలం 42 రోజుల్లోనే లక్ష కేసులు నమోదు అయ్యాయని ఈ పరిస్థితిని చూస్తే భవిష్యత్తులో డెల్టా వేరియంట్ ప్రభావం అమెరికాపై ఏ స్థాయిలో ఉండబోతోంది అనేది అర్థమవుతోందని అంటున్నారు పరిశీలకులు.డెల్టా వేరియంట్ మొదటి వేవ్ కంటే దారుణంగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube