కరోనా సోకిందని... మహిళను గెంటేసిన ఇంటి సభ్యులు

ప్రపంచ వ్యాప్తంగా గణనీయంగా పెరుగుతున్న కరోనా ప్రజల ప్రాణాలతో పాటు బంధాలను తెంపేస్తోంది.వైరస్ సోకిందని తెలిస్తే చాలు ఆ వైపు అడుగు వేయడం ప్రాణాలతో చెలగాటం ఆడాలనే భ్రమలో బతుకుతున్నారు కొందరు.

 Corona, Neloor, Women-TeluguStop.com

కరోనా వైరస్ తో చనిపోయినా దగ్గరకు కూడా రావడంతో లేదు.ప్రాణ భయం మానవత్వాన్ని, బంధాలను మంట కలుపుతోంది.

కోవిడ్-19 సోకిందని ఓ మహిళను కుటుంబసభ్యులే ఇంట్లోనుంచి గెంటేసిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.వైరస్ కారణంగా కుటుంబ సభ్యులు బయట పంపడంతో వారిలో దాగివున్న క్రూరత్వం బయట పడింది.

నెల్లూరు జిల్లాలోని కలువాయికి చెందిన ఓ మహిళకు కరోనా లక్షణాలు రావడంతో వైద్యులకు సంప్రదించింది.పాజిటివ్ గా నిర్ధారణ అయింది.కరోనా అని తెలియడంతో భయంతో కుటుంబ సభ్యులు ఆమెను ఇంటి నుంచి బయటకు నెట్టేశారు.గ్రామ వాలంటీర్ ను తెలియజేస్తే తమ పరిధి కాదని వేరే దగ్గరికి వెళ్లమని సూచించింది.

దీంతో ఏం చేయాలో తెలియక ఊరి చివరన రెండు రోజులుగా ఒంటరిగా వైరస్ తో పోరాడుతుంది.

కరోనా పేషంట్ ఉందని తెలిసినా అక్కడి గ్రామస్థులు, ఆశావర్కర్లు, స్థానిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు పట్టించుకోలేదు.

గ్రామస్థులు దూరంగా నిలబడి ఓదారుస్తున్నారు.ఇదీ చూసిన ఓ యువకుడు ఈ సన్నివేశాన్ని చిత్రికరించాడు.

వీడియోను తీసి మీడియాకు అందించాడు.ప్రస్తుతం ఈ వీడియో ట్విటర్ లో వైరల్ అవుతోంది.

కరోనా కట్టడి చేయాలని ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలు చేపట్టినా ఫలితం లేదు.అండగా ఉండాల్సిన వాళ్లే వైరస్ ఉందనే సరికి దూరంగా పారిపోతున్నారు.

కుటుంబ సభ్యులు ఆ మహిళను ఇంటి నుంచి గెంటేయడం చూసి పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube