లక్షణాలు లేకున్నా కరోనా పాజిటివ్ వచ్చిందా ...? ఇక డోంట్ వర్రీ ...!

చైనాలో ఎక్కడో మొదలైన కరోనా నేడు ప్రపంచం మొత్తం గజగజలాడిస్తోంది.అయితే ఇటీవలి కాలంలో చాలా మందికి కరోనా లక్షణాలు లేకుండానే వారికి కరోనా పాజిటివ్ వస్తోంది.

 Corona Positive, Corona Infected No Symptoms, Corona Virus, Andhra Pradesh, Coro-TeluguStop.com

నిజానికి ఈ విషయం కాస్త ఆందోళన కలిగించే విషయమే.కరోనా వైరస్ సోకితే మామూలుగా జ్వరం, దగ్గు, జలుబు గొంతునొప్పి ఇలాంటి లక్షణాలు కనపడతాయి.

అయితే చాలా మందికి ఈ వైరస్ సోకిన ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

అయితే ఎలాంటి లక్షణాలు లేని వారు కంగారు పడాల్సిన పని లేదని కరొనను ఎదుర్కొనే యాంటీ బాడీస్ వారి శరీరంలో ఎక్కువగా ఉండడం తోనే ఆ ప్రభావం బయటకు చూపలేకపోతుందని ఆంధ్రప్రదేశ్ కోవిడ్ కంట్రోల్ నోడల్ ఆఫీసర్ తెలియజేశారు.

అందుకోసం వారు ఎలాంటి ఆస్పత్రి వైద్యానికి రావాల్సిన అవసరం లేదని, ఇంట్లోనే ఉండి సామాజిక దూరం పాటిస్తూ డాక్టర్స్ తో తగు జాగ్రత్తలు తీసుకొని పాటిస్తే కరోనా నుండి సులువుగా బయటపడవచ్చని తెలియజేశారు.

అంతేకాకుండా ఇలాంటి వారి నుండి వైరస్ ఇతరులకు వ్యాపించే అవకాశం ఉందని, కాకపోతే వైరస్ సోకిన 10 రోజుల్లో అలాంటి వారి నుండి వైరస్ ఇతరులకు సోకినా అది బలహీన పడిపోతుందని తెలియజేశారు.

వీటితో పాటు ఎలాంటి వైద్యం లేకుండానే కోలుకున్న వారి శరీర భాగాలు ఏవి దెబ్బ తినవు అని తెలియజేశారు.కాబట్టి లక్షణాలు లేని కరోనా రోగులు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

అయితే ఇలాంటి వారితో పక్కవారికి కరోనా ఎక్కువగా వ్యాపిస్తుందని ఆయన తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube