మరోసారి కరోనా బారిన బండ్లన్న..!- Corona Infected Carts Once Again

Corona infected carts once again, carona virus, covid 19, postive, bandla ganesh, vakeelsaab event, apollo, hosipital - Telugu Apollo, Bandla Ganesh, Carona Virus, Covid-19, Hosipital, Postive, Vakeelsaab Event

తాజాగా సినీ నిర్మాత బండ్ల గణేష్ కు మరోసారి కరోనా సోకినట్లు తెలుస్తోంది.గత సంవత్సరం బండ్లగణేష్ కరోనా బారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే.

 Corona Infected Carts Once Again-TeluguStop.com

అయితే తాజాగా మరోసారి ఆయనకు కరోనా సోకింది.బండ్ల గణేష్ కు తాజాగా కరోనా వైరస్ సొకడనికి గల కారణం వకిల్ సాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన పాల్గొనడమే.

ఆ సమయంలోనే ఆయనకు కరోనా బారిన పడినట్టు సమాచారం.

 Corona Infected Carts Once Again-మరోసారి కరోనా బారిన బండ్లన్న..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వకిల్ సాబ్ రిలీజ్ ఈవెంట్ జరిగిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిన మరుసటి రోజు నుండి జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధ పడినట్లు తెలుస్తోంది.

అయితే ఒకసారి తనకు కరోనా పాజిటివ్ వచ్చి వెళ్లిన కారణంగా మరోసారి వచ్చి ఉండదు అని అనుకున్న బండ్లగణేష్ టెస్ట్ చేయించుకోలేదు.అయితే నొప్పులు మరుసటి రోజుకి తీవ్ర రూపం దాల్చడంతో ఆయన సోమవారం సాయంత్రం కరోనా టెస్ట్ చేయించుకున్నాడు.

ఇకపోతే ఈ టెస్టులో ఆయనకు కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

దీంతో బండ్ల గణేష్ ఆలస్యం చేయకుండా వెంటనే అపోలో ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లారు.

ప్రస్తుతం బండ్ల గణేష్ ఆరోగ్యం స్థిమితంగానే ఉన్నట్లు సమాచారం.ఈ సందర్భంగా బండ్ల గణేష్ తనను కలసిన వారిని కచ్చితంగా కరోనా పరీక్షలు చేయించుకోవలసిందిగా ఆయన కోరాడు.

ఇకపోతే వకిల్ సాబ్ ఫంక్షన్ కు హాజరైన చాలామందికి కోవిడ్ పాజిటివ్ వచ్చిందని తెలుస్తోంది.ఇదివరకే నిర్మాత దిల్ రాజు కూడా కరోనా పాజిటివ్ రావడంతో ఆయన ఐసోలేషన్ లోకి వెళ్లారు.

వీరితో పాటు హీరో పవన్ కళ్యాణ్ కూడా హోమ్ ఐసోలేషన్ లో ఉండి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

#Carona Virus #Postive #Hosipital #Apollo #COVID-19

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు