భారత్ లో కరోనా .. ఆందోళనలో ప్రపంచ దేశాలు ! 

భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నిత్యం మూడు లక్షలు దాటుతోంది.రోజురోజుకు కేసుల సంఖ్య  పెరుగుతుండడం తప్ప , ఎక్కడా తగ్గినట్లుగా కనిపించడం లేదు.

 Corona In India  World Countries In Concern , Bharath, Carona Virus, Covid 19, I-TeluguStop.com

గతంతో పోలిస్తే ఇప్పుడు తీవ్రతరం అయింది.వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయినప్పటికీ, పరిస్థితి ఈ విధంగా ఉండడం, కరోనా ఉద్ధతి తగ్గించడానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలు పెద్దగా ఉపయోగ పడకపోవడం వంటి కారణాలతో ఈ పరిస్థితి ఏర్పడింది.

ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అమెరికా తర్వాత భారత్ లో మాత్రమే ఈ స్థాయిలో కేసులు నమోదు అవతున్నాయి.గత ఏడాది ఇదే సమయంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంది.

కఠినమైన నిబంధనలు రూపొందించి, ప్రజలు రోడ్లపైకి రాకుండా చూసుకుంటూ, కరోనా మరింత పెరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు.  దీనికితోడు జనాలలోనూ ఆందోళన ఉండడం,  అన్ని వ్యవస్థలు సమన్వయంతో  వీటికి బ్రేకులు వేయగలిగాయి.

కానీ, ఈ ఏడాది కంటే రెట్టింపు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.  పూర్తిస్థాయిలో నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు.

ప్రజల్లో దీనిపై పూర్తి స్థాయిలో చైతన్యం కలగలేదు.ఆస్పత్రులలో ఆక్సిజన్ కొరత కారణంగా వందలాది మంది రోగులు నిత్యం మరణించడం , కరోనా ఉద్ధృతిని కేంద్రం ముందుగా అంచనా వేయకపోవడం, అందుకే ఆక్సిజన్ ప్లాంట్ ల  ఏర్పాటు విషయంలో పెద్దగా ఆసక్తి చూపించకపోవడం వంటి కారణాలతో ఇప్పుడు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

ఇప్పుడు శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటూ,  నష్ట నివారణ చర్యలకు కేంద్రం దిగుతున్న,  జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది.భారత్ లో నెలకొన్న పరిస్థితి పై దేశ వ్యాప్తంగా ఆందోళన కనిపిస్తోంది.

అంతే కాదు అంతర్జాతీయ మీడియాలో భారత్ లో  నెలకొన్న పరిస్థితి పై ఆందోళన వ్యక్తం చేస్తూ అనేక కథనాలు, ఎడిటోరియల్స్ ప్రచురితం అవుతున్నాయి.

అంతేకాదు ఇదంతా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల పేరుతో చేసిన రాజకీయమేనని అనేక అంతర్జాతీయ వార్తా సంస్థలు తమ కధనంలో పేర్కొన్నారు.

భారత్ లో అక్కడి రాజకీయ నేతల వైఖరి కారణంగా ప్రపంచ దేశాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని , ప్రభుత్వం తీసుకున్న చర్యలు , లోపాలు కారణంగా  ప్రజల్లో అలసత్వం కొత్త కొత్త వైరస్ లక్షణాలు బయట పడుతుండటం ఈ పరిస్థితికి కారణంగా అంతర్జాతీయ మీడియా పేర్కొంటూ భారత్ వైఖరిని తప్పుపడుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube