కరోనా ఎఫెక్ట్ : అమెరికాకి మరో భారీ ఆర్ధిక సాయం..!!!  

Corona Help Fed Main Street Lending Program - Telugu America, Corona Help, Coronavirus, Fed Reserve, Main Street Lending Program

కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజల ప్రాణాలు బలై పోవడం మాత్రమే కాదు భవిష్యత్తు మొత్తం అంధకారంలో పడిపోయింది.అమెరికా ఆర్ధికంగా ఎంతో బలమైన దేశం.

 Corona Help Fed Main Street Lending Program

అందుకే ఇప్పటికే అగ్ర రాజ్యంగా నిలబడుతోంది.కానీ కరోనా కారణంగా అమెరికా ఆర్ధిక పరిస్థితి ఒక్క సారిగా కుదేలేయ్యింది.

ముందు ముందు ఈ పరిస్థితి మరీ దారణంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు ఆర్ధిక నిపుణులు.ఈ పరిస్థితులలో ఆర్ధిక పరిస్థితి గనుకా పూర్తిగా చేయి దాటిపోతే ఇక అగ్ర రాజ్య హోదా పోయినట్టే.

కరోనా ఎఫెక్ట్ : అమెరికాకి మరో భారీ ఆర్ధిక సాయం..-Telugu NRI-Telugu Tollywood Photo Image

ఈ పరిస్థితులు అమెరికాకి రాకుండా ట్రంప్ ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు.ఈ క్రమంలోనే అమెరికాని ఆర్ధిక సంక్షేభం నుంచీ గట్టెక్కించడానికి అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ ముందుకొచ్చింది.అమెరికాకి మరో 2.3 లక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక సాయం ప్రకటించింది.అమెరికాలోని చిన్న, మధ్య తరహా సంస్థల యొక్క రుణాలు కొనుగోలు చేసేందుకు మెయిన్ స్ట్రీట్ లెండింగ్ ప్రోగ్రామ్ ఈ ప్యాకేజీ లో భాగమయ్యింది.

ఈ క్రమంలో కరోనా రాకముందు మంచి ఆర్ధిక పురోగతి కలిగి ఉండి స్తోమత ఉండి సుమారు 10వేల మంది కార్మికులని కలిగి ఉన్న సంస్థని సెలెక్ట్ చేసుకుని వారికి నాలుగేళ్ల కాలపరిమితి గల రుణాలని అందిస్తారు.అంతేకాదు వడ్డీ చెల్లించే విధానంలో ఒక ఏడాది పాటు వాయిదా వేస్తారు.ఈ విధానం వలన అమెరికాలో దాదాపు 3.5 కోట్ల మందికి ఉపాది కలిపిస్తున్న సుమారు 40 వేల పై చీలుకు కంపెనీలకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.కంపెనీలు అన్నీ మళ్ళీ లాభాల బాట పట్టడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు ఆర్ధిక నిపుణులు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Corona Help Fed Main Street Lending Program Related Telugu News,Photos/Pics,Images..