భారత్ లో కరోనా కరాళ నృత్యం,ఒక్కరోజులోనే ఏకంగా 20 వేలు....

భారత్ లో కరోనా కరాళ నృత్యం కొనసాగుతూనే ఉంది.రోజు రోజుకు దేశవ్యాప్తంగా ఈ కేసుల సంఖ్య పెరుగుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది.

 India, Coronavirus, Corona Cases,corona Health Bulletin-TeluguStop.com

వివిధ రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులతో దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో భారీగా నమోదు అయినట్లు తెలుస్తుంది.తాజాగా కేంద్ర ఆరోగ్య మ‌రియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ విడుద‌ల చేసిన క‌రోనా హెల్త్ బులెటిన్ ప్ర‌కారం.

దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంటల్లో క‌రోనాబారిన‌ప‌డి 410 మృతిచెంద‌గా, కేవలం ఒక్కరోజులోనే అత్యధికంగా 19,906 కొత్త పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.

దీంతో భార‌త్‌లో న‌మోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 5,28,859కు చేరుకుంది.

మరోపక్క ప్ర‌స్తుతం 2,03,051 మంది వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతుండ‌గా.ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయిన‌వారి సంఖ్య 3,09,713కు చేరినట్లు తెలుస్తుంది.

ఇక‌, మృతుల సంఖ్య 16,095కు పెరిగిన‌ట్టు కేంద్రం తాజా క‌రోనా బులెటిన్‌లో పేర్కొంది.ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఈ కరోనా కేసుల సంఖ్య కోటికి పైగా నమోదు కాగా, మృతుల సంఖ్య 5 లక్షలకు పైగానే నమోదు అయ్యాయి.రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడం తో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఎప్పుడు ఎలా ఎవరి నుంచి ఈ కరోనా మహమ్మారి వ్యాపిస్తుందో అన్న ఆందోళన వాళ్లలో మొదలైంది.

మరోపక్క ప్రపంచ దేశాలు కూడా ఈ కరోనా ను కట్టడి చేయడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఈ కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి.

భారత్ లో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది.ఇప్పటికే పలు రాష్ట్రాలు మరోసారి జులై 31 వరకు పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయాలు తీసుకుంటుండగా,మరి కొన్ని రాష్ట్రాలు మాత్రం సడలింపులు ఇస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

అయితే ఏది ఏమైనప్పటికి ఈ కరోనా మహమ్మారి తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ ప్రధాని నరేంద్ర మోడీ సైతం ప్రజలకు పిలుపు నిచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube