కరోనా ను తరిమికొట్టే పండు ఏదో తెలుసా?

ప్రస్తుతం కరోనాతో పోరాడేందుకు ప్రజలు ఎవరికి తోచిన రీతిలో వారు జాగ్రత్త పడుతూ ఉన్నారు ఒకవైపు జాగ్రత్తలు పాటించడంతో పాటు, మరోవైపు రోగ నిరోధకశక్తిని పెంచుకునే పనిలో ఉన్నారు.రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి వివిధ రకాల ఆహార పదార్థాలతో పాటు, పండ్లను తినడం వంటివి చేస్తూ రోగనిరోధక శక్తిని పెంచుకుంటున్నారు.

 To Boosting Immunity,improving Digestion,blood Cells Grow,relieves Eye Problems,-TeluguStop.com

కొన్ని రకాల పండ్లలో రోగనిరోధక శక్తిని పెంచే సామర్థ్యం అత్యధికంగా ఉండటం వల్ల వాటిని తినడం ద్వారా కరోనా కి చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు.అటువంటి పండ్లలో కివి ముందు వరుసలో ఉంటుంది.

కివి పండ్లలో రారాజు అని పేరు పొందింది.మిగతా పండ్లతో పోలిస్తే కివిలో అత్యధికంగా పోషక గుణాలు కలిగి ఉన్నాయి.ఇందులో విటమిన్లు, ఫైబర్, ఫోలేట్, కాపర్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మెండుగా ఉన్నాయి.విటమిన్ ఏ,విటమిన్ సి, ఇందులో అధికంగా ఉన్నాయి.

నిమ్మ నారింజ ఇతర సిట్రస్ జాతులతో పోలిస్తే ఇందులో ఎక్కువ శాతం విటమిన్ సి లభిస్తుంది. విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఈ పండు ను ప్రతి రోజూ తీసుకోవడం ద్వారా మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు ఎన్నో రకాల వైరస్ ల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను అరికట్టవచ్చు.

ఇందులో ఉన్న పోషక విలువలు మన రక్తంలోని రక్తకణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.డెంగ్యూ జ్వరంతో బాధపడే వ్యక్తులకు కివి పండ్లను తినడం ద్వారా వారి రక్తంలో అధిక సంఖ్యలో రక్త కణాలు పెరుగుతాయి.

కివి లో లుటిన్ అనే పదార్థం ఉండటం వల్ల కంటి చూపు మెరుగుపడటమేకాకుండా, కంటి లో వచ్చే సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.
ఇందులో ఉన్న ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

విటమిన్ కె అధికంగా ఉండటం వల్ల రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడుతుంది.ఏదైనా గాయాలు తగిలినప్పుడు అధిక రక్తస్రావం కాకుండా విటమిన్ కె సహాయపడుతుంది.

కివి లో యాంటీ ఆక్సిడెంట్, లుటిన్ వంటి పదార్థాలు అధికంగా ఉండటం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలను నిలకడగా ఉంచడమే కాకుండా,అధిక రక్తపోటు నుంచి, గుండె స్ట్రోక్ వంటి సమస్యల నుంచి కాపాడుతుంది ఇన్ని పోషక విలువలు ఉన్న కివి పండు ప్రతి రోజు తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటారని డాక్టర్లు సూచిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube