జీరో కేసులుంటే 50 లక్షల ప్రైజ్ మనీ.. మహరాష్ట్ర ప్రభుత్వం వినూత్న ప్రక్రియ..!

కరోనా సెకండ్ వేవ్ ప్రభావం మహారాష్ట్రలో బాగా చూపిస్తుంది.వేల కొద్దీ కేసులు వస్తున్న మహారాష్ట్రలో గ్రామాల్లో కరోనా కట్టడి కోసం వినూత్న ప్రక్రియ చేపడుతుంది.

 Corona Free Village Contest Maharashtra Cm Uddhav Thackeray Prize Money, Maharas-TeluguStop.com

గ్రామాల్లో కరోనా నియంత్రణని కోసం వినూత్న పోటీ ప్రవేశపెట్టింది.కరోనా ఫ్రీ విలేజ్ ఏర్పాటు చేస్తే ఆ విలేజ్ కి 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ అందిస్తున్నట్టు ప్రకటించారు.

కరోనాపై అవగాహన కల్పించడమే కాకుండా వైర్స్ కట్టడి కోసం ఈ పోటీ ప్రారంభిస్తున్నామని అన్నారు సిఎం ఉద్దవ్ ఠాక్రే.

కరోనా ఫ్రీ విలేజ్ పోటీ వైరస్ కట్టడిలో ఒక భాగమని అన్నారు రాస్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హసన్ ముష్రిఫ్.

ఈ ప్రక్రియలో కరోనా ఫ్రీ విలేజ్ గా మూడు ఉత్తమ గ్రామ పంచాయతీలకు ప్రైజ్ మనీ ఇవ్వబడుతుందని అన్నారు.ఫస్ట్ ప్రైజ్ గా 50 లక్షలు.రెండో బహుమతిగా 25 లక్షలు.3వ బహుమతిగా 15 లక్షల ప్రైజ్ మనీ అందిస్తారని తెలుస్తుంది.రాష్ట్రంలో 6 రెవిన్యూ విభాగాలు ఉండగా మొత్తం 18 బహుమతులు ఇవ్వాల్సి ఉంటుందని.మొత్తంగా 5.4 కోట్ల రూపాయలు కేటాయించామని అన్నారు.గెలిచిన బహుమతితో గ్రామాభివృద్ధికి ఉపగోగించవచ్చని తెలిపారు.

 గ్రామాల్లో యువత కరోనా కట్టడికి నడుం కట్టాలని వారి ద్వారానే ఈ ప్రైజ్ మనీని అందుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube