పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర రవాణాశాఖ మంత్రికి కరోనా..!

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది.సామాన్య ప్రజల నుండి ప్రజాప్రతినిధుల వరకు అందరు ఈ మహమ్మారి పేరు చెబుతూనే భయపడిపోతున్నారు.

 Corona, Positive, West Bengal, Minister-TeluguStop.com

కరోనా మహమ్మారి రాజకీయ నేతలను వదలడం లేదు.ఇప్పటికే చాల మంది రాజకీయ నాయకులు ఈ మహమ్మారి బారినపడిన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ మహమ్మారి కారణంగా చాల మంది నాయకులు ప్రాణాలు కోల్పోయారు.ఇక కొంతమంది నాయకులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇప్పటికే రాజకీయ నాయకులు ఈ వైరస్ బారిన పడకుండా చాల జాగ్రత్తలు తీసుకుంటున్న ఎదో విధానంగా ఈ మహమ్మారి వారికీ సోకుతూనే ఉంది.ఇక ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారినపడిన సంగతి అందరికి తెలిసిందే.

తాజాగా మరో నాయకుడు కూడా ఈ మహమ్మారి బారినపడ్డాడు.

తాజాగా తాజాగా పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి సువేందుకు కరోనా పాజిటివ్ వచ్చింది.

వైరస్ లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో ఆయన కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.ఈ నిర్దారణ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది.ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారని ఆరోగ్యశాఖ అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు.అంతేకాదు మంత్రి తల్లికి కూడా కరోనా వైరస్ సోకిందని తెలిపారు.

ఇక మంత్రి తన నియోజకవర్గంలోని గెస్ట్‌హౌస్‌లో గృహనిర్భందంలో ఉన్నారు.తన తల్లికి కోల్‌కతాలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

ఇప్పటికే ఆ రాష్ట్ర మంత్రులు ముగ్గురు కరోనా బారి నుండి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు.ఇక బెంగాల్‌లో ఇప్పటివరకు 2.37లక్షల పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube