నిమ్స్ లో కరోనా ఫస్ట్ ట్రయల్స్ విజయవంతం

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రి కేంద్రంగా నిర్వహించిన కరోనా ఫస్ట్ ట్రయల్స్ విజయవంతమైంది.నిమ్స్ (నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) లో భారత్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ‘కోవాగ్జిన్’ తొలి దశ క్లినికల్ ట్రయల్స్ విజవంతంగా ముగిసింది.

 Nimes, Corona, Vaccien-TeluguStop.com

ఈ క్లినికల్ ట్రయల్స్ లో ఐసీఎంఆర్ ఆదేశాల మేరకు 60 మందిలో 50 మందిని కరోనా బాధితులను తీసుకుని నిమ్స్ వైద్యాధికారులు పరీక్షలు జరిపారు.14 రోజుల పాటు కోవాగ్జిన్ డోస్ ను ఇచ్చి ఆ తర్వాత అదే కోడ్ కు చెందిన బూస్టర్ డోస్ ను అందించారు. నిమ్స్ సంచాలకులు డాక్టర్ కే.మనోహర్ ఆధ్వర్యంలో క్లినికల్ ఫార్మాలజీ విభాగం, సీనియర్ వైద్యులు, రెస్పిటరీ, అనస్తీషియా, జనరల్ మెడిసిన్ విభాగం డాక్టర్లు, పలువురు ప్రొఫెసర్లు ఈ క్లినికల్ ట్రయల్స్ పాల్గొన్నారు.

క్లినికల్ ట్రయల్స్ విభాగం అధికారి డాక్టర్ సి.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.క్లినికల్ ట్రయల్స్ లో వాలంటీర్ల శరీరంలో వచ్చే మార్పులను అనుగుణంగా టీకాలను అందించామని వెల్లడించాడు.వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్లందరూ ప్రస్తుతం హోం క్వారంటైన్ లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు.28 రోజుల తర్వాత రెండవ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించి, టీకాను ఇచ్చేందుకు ఏర్పాటు సిద్ధమయ్యాయని పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube