ఏపీలో మళ్లీ మొదలైన కరోనా భయం.. కేసులు పెరుగుతున్నాయట.. ?

గత సంవత్సరం ప్రజలను పీడించుకుతిన్న కరోనా మళ్లీ మొదలైందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో ప్రభుత్వాలు మరింతగా అప్రమత్తం అవుతున్నాయి.

 Corona Fear That Started Again In-TeluguStop.com

ఇక మహరాష్ట్ర, కేరళ వంటి రాష్ట్రాల్లో ఈ కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపధ్యంలో అక్కడి అధికారులు తగిన చర్యలు చేపట్టారు.ఇలా దేశంలో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి.

ఇదిలా ఉండగా ఏపీలో కూడా ఇటీవలి కాలంలో కరోనా కేసుల సంఖ్య ఒక్క సారిగా పడిపోయిందన్నది తెలిసిందే.కాగా ఈ ఆనందం ఆవిరయ్యేలా ఏపీలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయట.

 Corona Fear That Started Again In-ఏపీలో మళ్లీ మొదలైన కరోనా భయం.. కేసులు పెరుగుతున్నాయట.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం.నిన్న కొత్తగా 70 కేసులు నమోదు కాగా, ఈరోజు వాటి సంఖ్య మరింత పెరిగిందని పేర్కొంది.

ఇకపోతే గత 24 గంటల్లో 94 పాజిటివ్ కేసులు నమోదవగా, చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 21 కేసులు నమోదు కాగా, ప్రకాశం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.మరో వైపు 66 మంది కరోనా నుంచి కోలుకున్నారట.

ప్రస్తుతం రాష్ట్రంలో 603 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది.

#Corona Virus #COVID-19 #Cases

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు