అక్కినేని హీరోలు నాగచైతన్య మరియు అఖిల్‌లు సమ్మర్‌లో తమ లవ్ స్టోరీ మరియు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నారు.అయితే తాజాగా తెలుగు రాష్ట్రాలను కరోనా భయం కంపించేలా చేస్తుంది.
ఈ సమయంలో థియేటర్లను బంద్ చేయాలనే నిర్ణయం తీసుకుంటున్నారు.ఏపీలో నెల్లూరు జిల్లాలో థియేటర్ల బంద్ కొనసాగుతోంది.
ఇక ఇతర ప్రాంతాల్లో కూడా అనధికారికంగా బంద్ వాతావరణం కనిపిస్తోంది.

ఈ సమయంలో సినిమాల విడుదల నిర్ణయం ఏమాత్రం కరెక్ట్ కాదనే అందరు వ్యక్తం చేస్తున్నారు.అందుకే హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు అన్ని సినిమాలు వాయిదాలు పడుతూనే ఉన్నాయి.ఈ సమయంలోనే అక్కినేని హీరోల సినిమాలు కూడా విడుదల పడే అవకాశం కనిపిస్తుంది.
లవ్ స్టోరీ మరియు బ్యాచిలర్ చిత్రాలు ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తాయని ప్రకటన వచ్చింది.లవ్ స్టోరీ డేట్ ఇచ్చి కూడా వాయిదా వేశారు.
బ్యాచిలర్ చిత్రాన్ని తేదీ ఇవ్వకుండానే ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేయలేమని చెప్పేశారు.ఈ రెండు సినిమాల విడుదల లేకున్నా పర్వాలేదు కాని ఆలస్యం అయినా పర్వాలేదు కాని మంచి టైంలో రావాలని అక్కినేని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
మరి ఆ మంచి టైం ఎప్పుడు వస్తుంది అనేది తెలియని పరిస్థితి.కరోనా ఎఫెక్ట్ ఎప్పటి వరకు ఉంటుందో ఎవరు చెప్పలేరు.
మరి వాయిదాలు ఎన్నాళ్లని వేస్తారు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.ఈ అక్కినేని హీరోల సినిమాలు వచ్చేది ఎప్పుడో.!
.