కరోనా ఎఫెక్ట్: అల్లుడికి కట్నంగా ఆక్సిజన్ ను బహూకరించిన మామ..!

ఇప్పుడు అంతా కరోనా కాలం నడుస్తుంది అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.ఈ మహమ్మారి ఎప్పుడు మనల్ని వదిలి వెళ్లిపోతుందో గాని.

 Corona Effect Uncle Who Presented Oxygen To Alludi As Dowry Bridge, Marriage,gro-TeluguStop.com

కరోనా వైరస్ వలన మాత్రం ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.కరోనా వైరస్ వలన ప్రజలు అందరూ ఇంటికే పరిమితం అయిపోయారు.

ఒక పండగ లేదు పబ్బం లేదు.చక్కగా ఫ్యామిలీతో కలిసి పిక్నీక్ వెళ్ళింది లేదు.

ప్రాణాలు నిలబడితే చాలు అనుకుంటున్నారు.ఈ క్రమంలోనే పెళ్లిళ్లు కూడా ఎటువంటి హంగు, ఆర్భాటం లేకుండా సింపుల్ గా పెళ్లిళ్లు చేసేకుంటున్నారు.

ఈ నేపథ్యంలో కూతురు పెళ్ళికి తండ్రి ఇచ్చిన కట్నం ఏంటో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోవడం ఖాయం.సాధారణంగా కూతురు పెళ్లిచేసెటప్పుడు అల్లుడికి కట్నంగా ఎవరన్నా డబ్బులు గాని, స్థలాలు గాని, బంగారం, వెండి, వాహనాలు గాని కట్నంగా ఇవ్వడం మనం వినే ఉంటాము.

కానీ కరోనా కాలం కాబట్టి ఒక తండ్రి కలికాలం మాట పక్కన పెట్టి, ప్రస్తుత కరోనా కాలాన్ని దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గట్టే కట్నాన్ని ఇచ్చాడు.ఇంతకి ఏమి ఇచ్చాడనుకుంటున్నారు.

సమస్త మానవాళి బతకాలంటె కావలిసింది ఆక్సిజన్.ఈ కరోనా కాలంలో చాలామంది ఆక్సిజన్ దొరకక ప్రాణాలు సైతం కోల్పోయిన సంఘటనలు మనం ఎన్నో చూసి ఉంటాము.అందుకే ఒక తండ్రి తన కూతురికి కట్నం కింద ఆక్సిజన్ ను ఇచ్చాడు.ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని ప్రాంతానికి చెందిన సుధీర్ గోయల్ అనే వ్యక్తి అతని కూతురికి ఈ మధ్యనే వివాహం చేశారు.ఈ పెళ్లిలో సుధీర్ గోయల్ తన అల్లుడికి కట్నంగా ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు ఇచ్చారు.

పెళ్లి వేదికపై కూతురు, అల్లుడి చేతికి ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లును అందజేశారు.సుధీర్ గోయల్ ఎంతో సేవ దృక్పధం కలిగిన వ్యక్తి.

సేవా ధామ్ అనే ఆశ్రమాన్ని కూడా స్థాపించారు.

Telugu Bridge, Dowry, Groom, Oxygen, Latest-Latest News - Telugu

ఆ ఆశ్రమం ద్వారా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు.అందుకే కూతురి వివాహానికి కూడా పలువురికి ఉపయోగపడే ఆక్సిజన్ ను కానుకగా ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు.ఈ ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్‌ లను కట్నంగా అందుకున్న వధూవరులు వాటిని ఆక్సిజన్ అవసరమైన వారికి ఇస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా సుధీర్ గోయల్ మాట్లాడుతూ మా అల్లుడికి నేను 8 హామీలు నెరవేరుస్తా అని చెప్పాను.వాటిలో భాగంగానే రెండు ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్‌ లు బహుమతిగా ఇచ్చానని తెలిపారు.

ప్రస్తుతం ఈ ఘటనకి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.ఇంత మంచి ఆలోచన చేసిన సుదీర్ గోయల్ ని అందరు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube