కరోనా ఒత్తిడితో మంత్రి ఆత్మహత్య

కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తంను వణికిస్తుంది.అగ్ర రాజ్యాలను కూడా ప్రస్తుతం ఈ వైరస్‌ ఊపిరాడకుండా చేస్తుంది.

 Corona Effect Thomas Shaffer Sucide, Thomas Shaffer, Corona Effect, Germany Fina-TeluguStop.com

అభివృద్ది చెందిన దేశాలను ముఖ్యంగా ఈ వైరస్‌ ఒక కుదుపు కుదిపేస్తోంది.ఆర్ధిక వ్యవస్థలను సమూలంగా నాశనం చేసేలా వైరస్‌ విజృంభిస్తుంది.

జర్మనీ దేశంలో కూడా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నా బిన్నం అయ్యింది.అంతర్జాతీయ స్థాయిలో జర్మనీకి మంచి ఆర్థిక లావాదేవీలు ఉండటంతో ఇప్పుడు అవన్నీ కూడా ఆగిపోయాయి.

ఈ సమయంలో జర్మనీ ఆర్థిక మంత్రి వాటిని సరిచేయలేక, ప్రజలకు న్యాయం చేయలేక బ్రతుకుపైనే విరక్తి తెచ్చుకున్నాడు.తాజాగా జర్మనీ ఆర్థిక మంత్రి థామస్‌ షాఫర్‌ ఆత్మహత్య చేసుకున్నారు.

రైల్వే ట్రాకు వద్ద థామస్‌ మృతదేహంను గుర్తించారు.ఆయనది ఆత్మహత్యగా ప్రభుత్వం ప్రకటించింది.

ఒత్తిడి కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటాడంటూ ప్రాధమిక నిర్థారణకు వచ్చారు.ప్రపంచ దేశాల అధినేతులు మంత్రులు కూడా ప్రస్తుతం ఇదే ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube