కరోనా వల్ల దొంగగా మారిన సీరియల్ నటి!  

corona effect serial actress suchitra turned into thief,serial actress suchitra, corona effect, manikandhan, robbery - Telugu Corona Effect, Manikandan, Robbery, Serial Actress, Serial Actress Suchitra, Suchitra, Tamilnadu, Thief

దేశంలో ప్రస్తుతం కరోనా కాలం నడుస్తోంది.ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి.

TeluguStop.com - Corona Effect Serial Actress Suchitra Turned Thief

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

వైరస్ విజృంభణ ప్రధానంగా విద్య, సినీ, సీరియల్ రంగాలపై పడింది.లాక్ డౌన్ వల్ల గత కొన్ని నెలలుగా సినిమాలు, సీరియళ్ల షూటింగులు ఆగిపోయాయి.

TeluguStop.com - కరోనా వల్ల దొంగగా మారిన సీరియల్ నటి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

దీంతో ఈ రంగాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వాళ్లు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.తాజాగా ఆర్థిక ఇబ్బందుల వల్ల సీరియల్ నటి దొంగగా మారిన ఘటన వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే సుచిత్ర అనే నటి దేవత అనే సీరియల్ తో పాటు పలు సీరియళ్లలో ముఖ్య పాత్రల్లో నటించింది.సీరియల్స్ లో నటనతో అందరినీ ఆకట్టుకున్న నటికి లాక్ డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవటంతో దొంగగా మారాలని నిర్ణయం తీసుకుంది.

తన ప్రియుడు మణికందన్ కు ఇదే విషయం చెప్పి దొంగతనాలు చేయడానికి అతనిని ఒప్పించింది.అయితే ప్రియుడు మణికందన్ ఇంట్లోనే దొంగతనం చేసేలా ఆమె ప్లాన్ చేసింది.

సుచిత్ర ప్రియుడు మణికందన్ కు చాలా సంవత్సరాల క్రితమే వివాహమైంది.ఆ విషయం తెలిసి కూడా మణికందన్ తో సహజీవనానికి సుచిత్ర అంగీకరించింది.

మణికందన్ చెన్నై ప్రముఖ సినీ నటులకు, సీరియల్ నటులకు డ్రైవర్ గా పని చేస్తూ ఉంటాడు.ఆ విధంగానే మణికందన్ తో కూడా సుచిత్రకు పరిచయం అయింది.

సుచిత్ర ప్లాన్ ప్రకారం మణికందన్ 18 సవరాల బంగారంతో పాటు 50,000 రూపాయల నగదు దొంగలించాడు.

అయితే ఇంట్లో డబ్బు, బంగారం కనిపించకపోవడంతో మణికందన్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు ఇప్పటికే మణికందన్ ను అరెస్ట్ చేయగా సుచిత్ర మాత్రం పరారీలో ఉంది.కడలూరు జిల్లా పన్రుతిలో చోటు చేసుకున్న ఈ ఘటన కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

#SerialActress #Suchitra #Tamilnadu #Corona Effect #Manikandan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Corona Effect Serial Actress Suchitra Turned Thief Related Telugu News,Photos/Pics,Images..