తెలంగాణ పాస్‌పోర్ట్ సేవ‌ల‌పై క‌రోనా ఎఫెక్ట్.. !

ఆనందంగా సాగుతున్న ప్రజల జీవితాల్లోకి కరోనా అనే రక్కసి ప్రవేశించడం వల్ల ఎన్ని కష్టాలు ఎదుర్కొన వలసి వస్తుందో అందరికి ఈపాటికే అర్ధం అయ్యి ఉంటుంది.ఇప్పుడున్న పరిస్దితుల్లో ఎవరికి వారు కరోనా పట్ల చైతన్యవంతులై అప్రమత్తంగా వ్యవహరించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

 Telangana, Passport Services, Closed, 14 Centers, Corona Effect-TeluguStop.com

ఇకపోతే మనుషులకు సోకే అన్ని వ్యాధులు ఒకే తీరుగా ఉంటాయనే భావన తీసివేస్తే మంచిది.ఎందుకంటే కరోనా మొదటి వేవ్ వల్ల నష్టం జరగకపోయినా, ఈ సెకండ్ వేవ్ వల్ల మాత్రం జన జీవనం పూర్తిగా స్దంభించి పోతుంది.

ఇలాంటి క్లిష్ట పరిస్దితుల్లో బయట కాలు పెట్టే పరిస్దితులు లేవు.అందుకే ప్రభుత్వం కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదట.

ఈ నేపధ్యంలో తెలంగాణ పాస్‌పోర్ట్ సేవ‌ల‌పై ప‌డింది.రేప‌టి నుంచి రాష్ట్రంలో పాస్ పోర్ట్ సేవ‌ల‌ను నిలిపివేస్తున్న‌ట్టు అధికారులు ప్ర‌క‌టించారు.

కాగా మే 14వ తేదీ వ‌ర‌కు పాస్‌పోస్టు సేవ‌ల‌ను నిలిపివేస్తూ ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని అధికారులు చెబుతున్నారు.ఇకపోతే రాష్ట్రంలో మొత్తం పాస్‌పోర్టు సేవలను 14 తపాలా కార్యాలయాల ద్వారా అందిస్తున్న విషయం తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube