బాలీవుడ్ కి కరోనా ఎఫెక్ట్... ఆగిన అక్షయ్ కుమార్ సినిమా రిలీజ్  

Corona Effect On Bollywood Movies Release - Telugu Akshay Kumar,, Covid-19, Tollywood

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచమంతా భయపెడుతుంది.సుమారు 90 దేశాలకి ఈ వైరస్ పాకింది.

 Corona Effect On Bollywood Movies Release

ఇండియాలో కూడా వైరస్ సోకినా వారి సంఖ్య వందకి దగ్గర అవుతుంది.ఇండియాలో ఎక్కువగా విస్తరించకుండా ఎప్పటికప్పుడు వైద్యులు, ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది.

ఇదిలా ఉంటే ఈ వైరస్ భయంతో గుంపులు గుంపులుగా ప్రజలు తిరిగే పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదు.పెద్ద పెద్ద సభలే క్యాన్సిల్ చేసుకున్నారు.

బాలీవుడ్ కి కరోనా ఎఫెక్ట్… ఆగిన అక్షయ్ కుమార్ సినిమా రిలీజ్-Movie-Telugu Tollywood Photo Image

ఇప్పుడు ఈ ఎఫెక్ట్ మెల్లగా సినిమాల రిలీజ్ మీద పడుతుంది.

ముఖ్యంగా బాలీవుడ్ లో కరోనా భయం ఇప్పుడు నిర్మాతలని, నటులని వెంటాడుతుంది.

స్టార్ హీరో అక్షయ్ కుమార్ పోలీస్ ఆఫీసర్ గా చేసిన సూర్య వంశీ అనే సినిమా రిలీజ్ కి రెడీ అయ్యింది.అయితే ఇప్పుడు కరోనా భయంతో చాలా చోట్ల దియేటర్స్ మూసేయడంతో పాటు, ప్రజలు కూడా సినిమాలు చూసేందుకు దియేటర్స్ కి వెళ్ళడం లేదు.

దీంతో నిర్మాతలు భయపడి సినిమాని వాయిదా వేసేసారు.ఇలాంటి సమయంలో సినిమా రిలీజ్ అంటే కచ్చితంగా భారీ నష్టాలు చూడాల్సి ఉంటుందని నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

తరువాత రిలీజ్ ఎప్పుడు అనేది అధికారికంగా ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలిపినట్లు సమాచారం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు