అయ్యో పాపం.. నితిన్ పెళ్లి ఇప్పట్లో లేదంట!  

Nithin Marriage Postponed To December - Telugu Lockdown, Marriage, Nikhil Marriage, Nithin, Shalini

టాలీవుడ్‌లో యంగ్ హీరో నిఖిల్ తన పెళ్లిని ప్రస్తుతం ఉన్న లాక్‌డౌన్‌లోనే కానిచ్చాడు.గతకొద్ది రోజుల క్రితమే జరగాల్సిన పెళ్లిన లాక్‌డౌన్ కారణంగా వాయిదా వేసిన నిఖిల్, ఈ లాక్‌డౌన్‌ను ఇప్పట్లో తీయకపోవచ్చని అనుకున్నాడు.

 Nithin Marriage Postponed To December

దీంతో తాను ప్రేమించిన డా.పల్లవి వర్మను మే 15న పెళ్లి చేసుకున్నాడు.

అయితే హీరో నిఖిల్ పెళ్లితో పాటు మరో హీరో పెళ్లి గురించి గతకొద్ది రోజులుగా ఇండస్ట్రీ వర్గాల్లో తెగ చర్చ నడుస్తోంది.

అయ్యో పాపం.. నితిన్ పెళ్లి ఇప్పట్లో లేదంట-Gossips-Telugu Tollywood Photo Image

ఇండస్ట్రీలోని బ్యాచ్‌లర్ హీరోల్లో నితిన్ కూడా ఒకరు.

తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ యంగ్ హీరో ఏప్రిల్ 16న దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకునేందుకు రెడీ అయ్యాడు.గతకొంత కాలంగా తాను ప్రేమిస్తున్న షాలినిని ఫిబ్రవరిలో నిశ్చితార్థం చేసుకున్న నితిన్, ఏప్రిల్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకోవాలని అనుకున్నాడు.

కానీ కరోనా వైరస్ వల్ల దేశవ్యా్ప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉండటంతో నితిన్ తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు.

మే నెలలో లాక్‌డౌన్ తొలిగిపోతే వివాహం చేసుకోవాలని నితిన్ అనుకున్నాడు.

కానీ ఇప్పట్లో అంగరంగ వైభవంగా పెళ్లిల్లు జరిగే సూచనలు కనిపించడం లేదు.దీంతో నితిన్ తన పెళ్లిని ఏకంగా డిసెంబర్ నెలలో జరుపుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

డిసెంబర్ నెల వరకు పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని, అప్పుడే తన పెళ్లిని గ్రాండ్‌గా చేసుకోవాలని నితిన్ కోరుకుంటున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nithin Marriage Postponed To December Related Telugu News,Photos/Pics,Images..

footer-test