కరోనా ఎఫ్ఫెక్ట్ : భారత సంతతి మిస్ ఇంగ్లండ్ సంచలన నిర్ణయం..!!!

కరోనా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది అమాయక ప్రజలని పొట్టన బెట్టుకుంది.ఎంతో మంది ప్రజలు దిక్కు లేని అనాధలుగా మిగిలిపోయారు.

 Miss England Bhasha Mukherjee, Corona, Doctors, Stethoscope-TeluguStop.com

అయినా సరే

కరోనా మహమ్మారి

తన ప్రభావాన్ని ప్రపంచ దేశాలపై చూపిస్తూనే ఉంది.వేల సంఖ్యలో ప్రజల ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి.

ఒక పక్క రోగులకి వైద్యం చేస్తున్న వైద్యులు సైతం కరోనా బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.కొందరు విదులకి కూడా వెళ్ళమని రాజీనామాలు చేస్తున్న పరిస్థితులు ఎన్నో ఉన్నాయి.

ఈ క్రమంలో

మిస్ ఇంగ్లండ్ గా గత ఏడాది కిరీటాన్ని దక్కించుకున్న భారత సంతతి యువతిగా పేరొందిన బాషా ముఖర్జీ.వృత్తి రీత్యా డాక్టర్.

మిస్ ఇంగ్లండ్ గా ఎంపిక అయిన తరువాత తన కెరియర్ ని ధార్మిక కార్యక్రమాల వైపు మళ్ళించింది.అప్పటి నుంచీ నిన్నటి వరకూ డాక్టర్ గా విధులు చేపట్టలేదు.

కానీ కరోనా కారణంగా తను సేవ చేయాలని అనుకుంది.ఎంతో మంది రోగులు బాధపడుతున్నారు వారికోసం మళ్ళీ స్టెతస్కోప్ పట్టుకోబోతున్నాని తెలిపింది.

ఇటీవల బోస్టన్ లోని తన సహచరుల నుంచీ సమాచారం అందటంతో బోస్టన్ వెళ్తున్నాని తెలిపింది.రెండు వారలా క్రిందటే వెళ్ళిన ఆమె కరోనా రోగులు ఉన్న ఐసోలేషణ్ వార్డ్ లో విధులు నిర్వర్తించిందట.

ఇకపై రోగుల సేవలోనే ఉంటానని విపత్కర పరిస్థితులో నా వృత్తిని కొనసాగిస్తానని తెలిపింది.బోస్టన్ లోని పిలిగ్రిమ్ హాస్పటల్ రోగులకి ఈమే సేవలు అందుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube