కరోనా కారణంగా కనిపిస్తున్న హిమాలయాలు... ఘననీయంగా తగ్గిన కాలుష్యం

ప్రపంచంలో ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు గ్లోబల్ వార్మింగ్ గురించి టెన్షన్ పడ్డారు.అంతకంతకు పెరిగిపోతున్న కాలుష్యంతో వాతావరణ స్థితిగతులు పూర్తిగా గాడితప్పుతున్నాయని, భూమి వేడెక్కుతుంది అని వాతావరణ నిపుణులు హెచ్చరించారు.

 India's Lockdown Is Having A Dramatic Impact On Pollution, Corona Effect, Nature-TeluguStop.com

గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో అనేక ప్రకృతి విపత్తులు చూడాల్సి వస్తుందని కూడా తెలిపారు.అయితే ప్రపంచంలో సమాజం దారితప్పినపుడు, భౌగోళిక స్థితిగతులు దెబ్బతింటున్నాయి అనే సమయంలో ఏదో ఒక రూపంలో నేను వచ్చి మళ్ళీ వాటిని గాడిలో పెడతా అని భగవంతుడు చెబుతాడు.

ఈ మాటలు ఇప్పుడు కరోనా కారణంగా ప్రపంచంలో వచ్చిన మార్పులు చూస్తే నిజమని అనిపిస్తుంది.

భగవంతుడు ఊరికే రాడు భయపెడుతూ వస్తాడు.

అందరిని సరిచేసి వెళ్ళిపోతాడు అని మన పూర్వీకులు చెబుతూ ఉంటారు.ఇప్పుడు కరోనా వైరస్ అలాగే ప్రపంచాన్ని భయపెడుతుంది.

అయితే ఈ కరోనా వైరస్ కారణంగా చాలా వరకు దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయాయి.జనం ఇళ్లలోనే ఉంటున్నారు.

రోడ్లపై వాహనాలు నడవడం లేదు.ఫ్యాక్టరీలు మూతపడ్డాయి.

దీంతో పెరిగిపోతున్న కాలుష్యం గణనీయంగా తగ్గిపోయింది.ఎక్కడా కూడా శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం, జల కాలుష్యం లేదు.

దేశంలోని అన్ని నగరాలలో పరిశుభ్రంగా మారిపోతున్నాయి.పంజాబ్ లోని జలంధర్ ప్రజలు అద్భుత దృశ్యాన్ని వీక్షిస్తున్నారు.

వీరంతా హిమాలయాల పర్వత శ్రేణిని చూస్తూ ఆనందిస్తున్నారు.హిమాలయాలు కనిపించడం ఇది వరకు ఎప్పుడు జరగలేదని, చాలా ఏళ్ల తర్వాత ఆ అద్భుత దృశ్యాలు చూడగలుగుతున్నాం అని చెబుతున్నారు.

దీనిని బట్టి వాతావరణ మార్పులని మళ్ళీ సాధారణ స్థితిలోకి తీసుకురావడంలో కరోనా ఎంత ముఖ్య మాత్ర పోషిస్తుందో చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube