అమెరికా చదువులు : భారత విద్యార్ధులకు తప్పని వీసా కష్టాలు...!!!

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది విద్యార్ధులు, నిపుణులు అమెరికా వెళ్లి చదువుకోవాలని, స్థిరపడాలని కోరుకుంటారు.ఈ క్రమంలోనే వివిధ దేశాల నుంచీ ప్రతీ ఏటా అమెరికా వెళ్లి చదువుకోవాలనే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.

 Corona Effect  Indian Students Visa Issues , America, Visa, Indian Students, Vi-TeluguStop.com

ముఖ్యంగా భారత్ నుంచీ అమెరికా వెళ్లి చదువుకావాలనుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.కరోనా నేపధ్యంలో అమెరికా చదువులకు కొంత విరామం వచ్చినా తాజాగా కరోనా తగ్గుముఖం పట్టి, అమెరికా విదేశీ విద్యార్ధుల ఉన్నత విద్య కోసం పచ్చ జెండా ఊపడంతో ఇప్పుడు మళ్ళీ విద్యార్ధులు అమెరికా వెళ్లేందుకు గడించిన రెండు నెలలుగా ప్రణాలికలు సిద్దం చేసుకున్నారు.

అయితే ఈ ఏడాది అమెరికా యూనివర్సిటీలలో ఉన్నత విద్య కోసం అడ్మిషన్లు పొంది, విద్యా సంవత్సరం ముంచు కొస్తున్న సమయంలో విద్యార్ధులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు.వీసా జారీ విషయంలో తీవ్రంగా జాప్యం జరుగుతోందని, అలాగే విమాన సర్వీసులు కూడా లేకపోవడంతో విద్యార్ధులు మండిపడుతున్నారు.

కరోనా సెకండ్ వేవ్ సమయంలో భారత్ లో విపరీతమైన కేసులు పెరిగిపోవడంతో అమెరికా ప్రభుత్వం భారత్ లో ఉన్న అమెరికా వాసులను వచ్చేయాలని ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసింది.

Telugu America, Corona Effect, Coronaeffect, Indian, Visa, Vissa-Telugu NRI

ఈ క్రమంలోనే భారత్ లో ఉన్న రాయబార కార్యాలయాలు, కాన్సులేట్ లలో ఉండే సిబ్బంది అమెరికాకు వెళ్ళిపోయారు.దాంతో ఇప్పుడు సిబ్బంది కొరత కారణంగా వీసా అపాయింట్మెంట్ కోసం విద్యార్ధులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.అంతేకాదు వీసా లు చేతికి రాకముందే ప్రయాణానికి టిక్కెట్లు కూడా చాలా మంది రిజర్వ్ చేసుకున్నారు ఇప్పుడు వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

అంతేకాదు అమెరికా వెళ్ళే విమాన సర్వీలు పూర్తిగా తగ్గిపోవడం భారత విద్యార్ధులకు మరో సమస్యగా మారింది.మరోవైపు గతంలో కంటే విమాన ప్రయాణ చార్జీలు సుమారు 5 రెట్లు అధికంగా పెరిగాయట, పోనీ అదనపు చెల్లింపులకు కూడా విద్యార్ధులు సిద్దమవ్వగా సర్వీసులు రద్దు అవడంతో చేసేది లేక చార్టర్ విమానాల వైపు మొగ్గుచూపాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube