జగన్ కు కరోనా కష్టాలు ! 5 వేల కోట్లు నష్టం...?  

Corona Effect For Jagan Governament - Telugu 5000 Cr. Funds Stop In Ap, Ap Cm Jagan Mohan Reddy, Ap Elections Post Pone, Ap Local Elections, Corona Effect In India, Corona Virus, Jagan Angry For Post Pone The Ap Elections, Ycp Governament Schems

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ దాటికి ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి.ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి.

 Corona Effect For Jagan Governament

ఇప్పటికే ఈ వైరస్ బారినపడి ప్రపంచవ్యాప్తంగా వేలాది మరణాలు సంభవించాయి.ఇండియాలోనూ కరోనా ప్రభావం అన్ని రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది.

ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవతోంది.ప్రస్తుతానికి కరోనా వైరస్ ఏపీలో అంత ప్రభావం చూపించకపోయినా వైసీపీ ప్రభుత్వానికి మాత్రం కరోనా చుక్కలు చూపిస్తోంది.

జగన్ కు కరోనా కష్టాలు 5 వేల కోట్లు నష్టం…-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

సుమారు ఐదువేల రూపాయలకు కరోనా ఎఫెక్ట్ కారణంగా గండి పడింది.

అసలే ఏపీలో పెద్ద ఎత్తున ప్రజా సంక్షేమ కార్యక్రమాలను, పథకాలను వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోంది.

వీటికి పెద్ద ఎత్తున నిధుల అవసరం.ఈ మార్చి నెలాఖరులోగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల తంతు పూర్తి చేస్తే కేంద్రం ఇచ్చే ఐదువేల కోట్ల సొమ్ములు ఏపీకి అందుతాయని జగన్ భావించారు.

కానీ ఇప్పుడు ఏపీలో ఎన్నికల తంతు వాయిదా పడడంతో ఇప్పుడు ఆ ఐదు వేల కోట్ల నిధులు ఏపీకి వచ్చే అవకాశాలు లేకుండా పోయింది.ఈ నెల 31వ తేదీలోగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం జగన్ భావించారు.

నిర్దేశించిన గడువుకి ముందే ఎన్నికల తంతు పూర్తి చేసి ఆ ఐదువేల కోట్ల నిధులను పొందాలని జగన్ చూశారు.కానీ అనూహ్యంగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల తంతు నిలుపుదల చేయాలని టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేయడం, బీజేపీ దీనికి మద్దతు పలకడంతో ఏపీలో ఎన్నికల తంతు నిలిపివేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.దీంతో జగన్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికలు రెండేళ్ల క్రితమే పూర్తి చేయాల్సి ఉన్నా, అప్పటి టీడీపీ ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టలేదు.

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవాలని టీడీపీ వెనుకంజ వేసింది.ఇప్పుడు జగన్ తొందరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని చూసినా కరోనా వైరస్ ను సాకుగా చూపించి ఎన్నికలు వాయిదా వేయడంతో జగన్ ప్రభుత్వం ఆలోచనలో పడింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test