లాక్ డౌన్ ఎఫెక్ట్... మూగబోయిన థియేటర్... సౌండ్ చేస్తున్న టీవీ

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో ఒక్కసారిగా అన్ని రంగాలు ఆగిపోయాయి.ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అంతా బంద్ అయిపోయింది.

 Television Views 37 Percent Increase After Lockdown, Corona Effect, Entertainmen-TeluguStop.com

థియేటర్స్ మూత పడ్డాయి.ఇక ప్రజలు అందరూ ఇంటికే పరిమితం కావడంతో ఎక్కువ మంది సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తున్నారు.

ఇంత కాలం బిజీ లైఫ్ లో ఇంటిలో టైం స్పెండ్ చేయలేని వారు కూడా ఇప్పుడు 24 గంటలు ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి దీంతో మెజారిటీ ప్రజలు, ఖాళీగా ఉన్న వారు టీవీలకి అతుక్కుపోతున్నారు.

ఈ నేపధ్యంలో దేశంలో వారం రోజుల్లో టీవీ వీక్షణం రికార్డు స్థాయిలో 37 శాతం పెరిగినట్లు బ్రాడ్‌కాస్టు ఆడియెన్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌ ప్రకటించింది.

లాక్‌డౌన్‌ కొనసాగినంత కాలం టీవీ వీక్షణం ఇదే స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందని బార్క్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సునీల్‌ లుల్లా చెప్పారు.నాన్‌–ప్రైమ్‌టైమ్‌లోనూ వీక్షకుల సంఖ్య భారీగా పెరుగుతోందని తెలిపారు.

ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వడంతో వారి కాలక్షేపం కోసం కేంద్ర ప్రభుత్వం కూడా పలు సీరియల్స్‌ను తిరిగి ప్రసారం చేస్తున్న విషయం తెలిసిందే.రామాయణం, శక్తిమాన్‌ వంటి ప్రజల ఆధరాభిమానాలను పొందిన సీరియల్స్‌ బుల్లితెరపై మరోసారి సందడి చేస్తున్నాయి.

ఈ నేపధ్యంలో పిల్లలతో పాటు పెద్దలు కూడా టీవీకి అతుక్కుపోయారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube