కరోనాతో కలిసి బ్రతకడానికి మానసికంగా సిద్ధం

ప్రపంచ దేశాలని గత రెండు నెలలుగా తీవ్రంగా భయపెడుతూ ఎవరిని మనశ్శాంతి లేకుండా చేస్తున్న కరోనా వైరస్ ఇప్పటికే మానవ ప్రపంచంలో ఒక భాగం అయిపొయింది.కరోనా బాధితులు ఇప్పటికి 50 లక్షలకి సమీపిస్తున్నారు.

 People Must Learn To Live With The Virus, Corona Effect, Covid-19, Lock Down, In-TeluguStop.com

ఇక లక్షల సంఖ్యలో మృత్యువాత పడ్డారు.హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారు ఉన్నారు.

ఇక ఓ వైపు అన్ని దేశాలు కరోనా కట్టడి చేయడానికి లాక్ డౌన్ ని అమలు చేసాయి.ఇండియాలో ప్రపంచంలోనే అతి పెద్ద లాక్ డౌన్ విధించారు.

ప్రస్తుతం ఇండియా ఇంకా లాక్ డౌన్ దశలోనే ఉంది.అయితే ఈ లాక్ డౌన్ కారణంగా అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థలు కుప్పకూలే పరిస్థితిలో ఉన్నాయి.

ఆదాయం పూర్తిగా ఆగిపోయింది.పరిశ్రమలు నడవడం లేదు.

ఏది ఏమైనా కరోనా ఎఫెక్ట్ పరిశ్రమల మీద పెద్ద ఎత్తున పడింది.

అంతర్జాతీయ కుబేరుల ఆస్తులు గణనీయంగా కరిగిపోయాయి.

ఇక ఇదే సమయంలో కరోనా కట్టడి చేయడానికి విధించిన లాక్ డౌన్ పెద్దగా సత్ఫలితాలు ఇచ్చేలా కనిపించడం లేదు.ఇండియాలో లాక్ డౌన్ ఉన్నా కూడా కరోనా కేసులు 70 వేలకి చేరిపోయాయి.

ఈ నేపధ్యంలో లాక్ డౌన్ కొనసాగించాలని అనుకున్న ఆర్ధిక పరిస్థితులు ఇబ్బంది పెడుతున్నాయి.ఈ నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలని ఓ వైపు అప్రమత్తం చేస్తూనే కరోనాతో కలిసి బ్రతకాల్సిందే అనే విషయాన్ని ప్రజలలోకి తీసుకొని వెళ్తున్నారు.

మళ్ళీ సాధారణ స్థితిలోకి రావాలంటే కరోనాని ఒక సీజనల్ వ్యాధిగా పరిగణించి ధైర్యంగా ముందడుగు వేయాల్సిందే అని స్పష్టం చేసేస్తున్నారు.ఇప్పటికే ప్రపంచ దేశాలలో కూడా ప్రజలని అక్కడి ప్రభుత్వాలు ఈ విధంగా సిద్ధం చేసాయి.

ఇప్పుడు ఇండియాలో కూడా కరోనా అనే భయాన్ని ప్రజల మధ్యలోంచి తీసేయడానికి ప్రభుత్వాలు, మీడియా చానల్స్ ప్రముఖంగా పనిచేస్తున్నాయి.కరోనా అనే అంశానికి ప్రాధాన్యత తగ్గిస్తూ, మిగిలిన అంశాలకి ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఈ నేపధ్యంలో ప్రజలు కూడా మానసికంగా కరోనాతో కలిసి బ్రతకడానికి రెడీ అయిపోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube