రెండోసారి విజృంభిస్తున్న కరోనా.. లండన్ లో మళ్ళీ లాక్ డౌన్..  

Corona Effect again Lockdown Imposed in London, London, Corona Positive cases, Lockdown - Telugu Corona Effect Again Lockdown Imposed In London, Corona Positive Cases, Lockdown, London

కరోనా వైరస్ రెండోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో.9 మిలియన్ల జనాభా ఉన్న లండన్ నగరంలో ప్రస్తుత పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని.హెల్త్ సెక్రటరీ హన్ కాక్ అన్నారు.దీన్ని కట్టడి చేయాలి అంటే ఆంక్షలు తప్పనిసరి అన్నారు.లేదంటే పరిస్థితులు మరింత ప్రమాద కరంగా ఉంటాయన్నారు.కాబట్టి లండన్ ప్రజలంతా తాజా లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

TeluguStop.com - Corona Effect Again Lockdown Imposed In London

లండన్ మేయర్ సాదిక్ ఖాన్ మాట్లాడుతూ ఇలాంటి నిబంధనలు ప్రజలకు ఎవరికీ ఇష్టం లేకపోయినా.మనల్ని మనం కాపాడుకోవడానికి పాటించక తప్పదు అన్నారు.
ఈ నేపథ్యంలో బ్రిటన్ రాజధాని లండన్లో ప్రధాని బోరిస్ జాన్సన్ మరోసారి లాక్ డౌన్ ప్రకటించారు.శుక్రవారం అర్ధరాత్రి తర్వాత నుంచి నగరంలో లాక్డౌన్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.

కేవలం వారం రోజుల్లోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రెట్టింపు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూకే హెల్త్ సెక్రటరీ మట్ హన్ కాక్ తెలిపారు.రెండు నుంచి మూడు వారాల పాటు ఈ లాక్ డౌన్ కొనసాగించే సూచనలు ఉన్నాయి.

TeluguStop.com - రెండోసారి విజృంభిస్తున్న కరోనా.. లండన్ లో మళ్ళీ లాక్ డౌన్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

తాజా లాక్ డౌన్ నిబంధనల ప్రకారం.లండన్ ప్రజలు ఇతరులు ఇళ్లకు వెళ్లడం లేదా ఇతరులు తమ ఇంటికి ఆహ్వానించడం నిషేధము.

ఇండోర్ -అవుట్డోర్ సమూహ సమావేశాల పై నిషేధం విధించారు.అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్ళరాదు.

బయటికి వెళ్లాల్సి వస్తే పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో కాకుండా.కాలినడకన లేదా సైకిల్ పై మాత్రమే వెళ్లాలి.

ట్రాఫిక్ బిజీగా ఉన్న టైమింగ్స్ ను, రద్దీగా ఉండే రోడ్లను అవాయిడ్ చేయాలి.వివాహాలు,అంత్యక్రియలు వంటి కార్యక్రమాలను తక్కువ మంది తో నిర్వహించాల్సి ఉంటుంది.

అన్ని రకాల వాణిజ్య కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు.అయితే covid-19 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.

#Lockdown #London #CoronaEffect #CoronaPositive

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Corona Effect Again Lockdown Imposed In London Related Telugu News,Photos/Pics,Images..