కరోనా ఎఫెక్ట్...ఇరాన్ లో చిక్కుకుపోయిన 340 మంది భారతీయ జాలర్లు..!!!

యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది.అన్ని దేశాలు కరోన వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

 Corona Effect 340 Indian Fishermen Stranded In Iran-TeluguStop.com

వేరే దేశానికి వెళ్ళే ముందు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాతనే అనుమతి లభిస్తోంది.ఈ క్రమంలోనే ఇరాన్ తమ విమానాల రాకపోకలు నిలిపి వేశారు.

దీని కారణంగా అక్కడ ఉన్న భారతీయులు సొంత దేశానికి చేరుకోడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.ఈ విధంగానే ఇరాన్ లో గుజరాత్ కు చెందిన 340మంది మత్స్యకారులు ఇర్రుక్కుపోయారు.

Telugu Coronaeffect, Corona Iran, Fishermen-Telugu NRI

ఉపాధి కోసం గుజరాత్ నుండి ఇరాన్ వెళ్ళిన 340 మంది మత్స్యకారులు తిరిగి రావడానికి విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో ఎంతో ఆందోళన పడుతున్నారు.ఇరాన్ దేశంలో బందర్ ఏ చిరు, చిరుయేహ్, హోర్మోజగాన్ ప్రావిన్సుల్లో నివాసముంటూ అక్కడే పనిచేస్తున్నారు.మత్స్యకారులకు ఇది సీసన్ కాకపోవడంతో సొంత దేశానికి తిరిగిరావాలని నిర్ణయించుకున్నారు,కాని ఇరాన్ లో పరిస్థితుల కారణంగా నిస్సహాయులుగా మిగిలిపోయారు .ఈ నేపద్యంలోనే స్వదేశానికి తీసుకురావాలని గుజరాత్ కేంద్ర అటవీ, గిరిజనాభివృద్ధి శాక మంత్రి రమణ్ లాల్ పాట్కార్ కేంద్ర విదేశీ మంత్రిత్వశాఖకు లేఖ రాశారు.ఈ లేఖలో రమణ్ లాల్, గుజరాత్ మత్సకారులు ఇరాన్ సముద్ర తీరంలో చిరుయేహ్ నగరంలో చేపల పడవలను అద్దెకు తీసుకొని చేపలు పట్టి విక్రయిస్తున్నారని పేర్కొన్నారు.ఇదిలాఉంటే…

తన భర్త జయేష్ ఇరాన్ దేశంలో చిక్కుకున్నారని,అతన్ని క్షేమంగా స్వదేశానికి తీసుకురావాలని భార్య భారతి కోరగా, “మా మావయ్యతో పాటు మరికొందరు బంధులువు ఇరాన్ దేశంలోని చిరు నగరంలో ఉన్నారని, అక్కడ చేపల సీజన్ ముగిసినందున వారిని స్వదేశానికి తరలించాలి” అని వల్సాద్ లోని బారి బరియా వర్గ అధ్యక్షుడు హరీష భారీ సర్కారును కోరారు.ప్రత్యేక విమానాన్ని పంపించి మత్స్య కారులను స్వదేశానికి తీసుకురావాలని వారి కుంటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube