విద్యార్థుల నూతన ఆవిష్కరణ.. ఇకనుంచి ఎక్స్ రే తోనే..?

ప్రస్తుతం భారతదేశం రోజురోజుకు కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుంటుంది.ఇప్పటికే నాలుగు లక్షలు దాటిపోయిన కేసులు ఐదు లక్షలకు చెరువులో ఉన్నాయి.

 Corona, Xray, Iit Students,corona Diagnosed With X Ray Assiatance-TeluguStop.com

దీంతో ప్రజలు మరింత తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.ముఖ్యంగా కరోనా నిర్ధారిత పరీక్షలకు ఎక్కువ సమయం పడుతున్న నేపథ్యంలో ఈ మహమ్మారి వైరస్ కేసుల సంఖ్య ఆలస్యంగా వెలుగులోకి వస్తోన్నాయి.

తద్వారా ఈ మహమ్మారి వైరస్ మరింత మందికి వ్యాప్తి చెందేందుకు అవకాశం ఏర్పడుతుంది.ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఐఐటి గాంధీనగర్ విద్యార్థులు సరికొత్త ఆలోచనతో వినూత్న ఆవిష్కరణ చేశారు.

ఛాతికి సంబంధించిన ఎక్స్ రే తీసి దానిని కంప్యూటర్ ఆధారంగా పరిశీలిస్తే… కోవిడ్ నిర్ధారణకు అవకాశం ఉంటుందని… దీనికి తగ్గట్టుగా ఒక ప్రత్యేకమైన కంప్యూటర్ ప్రోగ్రామ్ కూడా రూపొందించినట్లు ఐఐటి గాంధీనగర్ విద్యార్థులు తెలిపారు,

అంతేకాకుండా దీనికోసం డీప్ లెర్నింగ్ టూల్ అనే ఓ ప్రత్యేకమైన యంత్రాన్ని కూడా తాము రూపొందించినట్లు విద్యార్థులు చెప్పుకొచ్చారు.ఛాతి భాగంలో తీసిన ఎక్స్ రే ను ఈ యంత్రానికి లింకు చేస్తే.

కరోనా ఫలితాలను తెలియజేస్తుంది అని తమ పరిశోధనల్లో తేలినట్లు విద్యార్థులు తెలిపారు.మెదడులోని నాడీ వ్యవస్థ ఆధారంగా ఈ ప్రత్యేకమైన యంత్రాన్ని తయారు చేసినట్టు చెప్పారు ఐఐటీ విద్యార్థులు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube