కరోనా తో అతలాకుతలం,తొలిసారి రికార్డ్ స్థాయిలో మరణాలు!

కరోనా మహమ్మారి భారత్ ను అతలాకుతలం చేసేస్తుంది.రోజు రోజుకు నమోదవుతున్న కేసుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతూనే ఉన్నాయి.

 Record Range Corona Deaths Happened In India , Corona Virus, India,-TeluguStop.com

ఇప్పుడు తాజాగా తొలిసారి రికార్డ్ స్థాయిలో మరణాలు చోటుచేసుకోవడం మరింత ఆందోళన కలిగిస్తుంది.తాజా సమాచారం ప్రకారం గడచినా 24 గంటల్లో దేశవ్యాప్తంగా 45 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,129 మరణాలు చోటుచేసుకోవడం గమనార్హం.

కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం తాజాగా భారీగా కేసులు నమోదు అవ్వడం తో పాటు రికార్డ్ స్థాయిలో మరణాలు కూడా చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది.తాజా కేసుల నమోదుతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 12 లక్షలకు పైగా నమోదు అయ్యాయంది.

దేశంలో అత్యధికంగా మహారాష్ట్ర,ఢిల్లీ,తమిళనాడు రాష్ట్రాల్లో కేసులు నమోదు అవుతున్నాయి.ఇప్పటికే మహారాష్ట్రలో మూడు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా,తమిళనాడు లో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి.

ఇక దేశ రాజధాని ఢిల్లీ లో కూడా లక్షపై చిలుకే ఈ కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.ఇక తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాణాలలో కూడా కరోనా కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి.

కరోనా తో అతలాకుతలం,తొలిసారి ర�

అలానే మరణాలు చూసుకున్నా మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడులలోనే ఎక్కువగా నమోదు అవుతున్నాయి.ఈ మహమ్మారికి ప్రపంచ దేశాలు సైతం అల్లాడిపోతున్నాయి.సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ కరోనా బారిన పడుతుండడం తో ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube