కర్ణాటకలో కరోనా డేజంర్ బెల్స్..!

కర్ణాటక రాష్ట్రంలో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.రోజురోజుకు కొత్త కేసులు గణనీయంగా నమోదవుతున్నాయి.

 Karnataka, Corona, Cases, Deaths-TeluguStop.com

దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.సామాన్య ప్రజల నుంచి ప్రజాప్రతినిధులకు కరోనా భయం వెంటాడుతోంది.

ఇప్పటికే రాష్ట్రంలో నాలుగు లక్షలకు చేరువలో కరోనా కేసులు ఉన్నాయి.

కర్ణాటక ఆరోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది.

గడిచిన 24 గంట్లలో రాష్ట్రంలో మరో 9,796 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో రాష్ట్రంలో మొత్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3,89,232 కి చేరింది.128 మంది కరోనా బారిన పడి మరణించగా.ఆ సంఖ్య 6,298కి చేరింది.

రాష్ట్రంలో ఇప్పటివరకూ 2,83,298 మంది కరోనా బారిన పడి క్యూర్ అయ్యారు.అయితే ప్రస్తుతం రాష్ట్రంలో 99,617 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

రాష్ట్రంలో కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతున్నాయి.కరోనా కేసులను కట్టడి చేయడానికి ప్రభుత్వం భావిస్తోంది.

ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.ప్రజలు మాస్కులు ధరించకుండా బయటకు రావొద్దని, శానిటైజర్ తో ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలని సలహా ఇచ్చారు.

బయటకు వెళ్లేటప్పుడు సామాజిక దూరం పాటించాలని సూచించారు.అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube