నమ్మలేని నిజం: ఇక కరోనా తో మాటల్లేవ్, మాట్లాడినా..

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి కి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా పాజిటివ్ రాగా,50 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పటివరకూ ఈ వైరస్ అనేది కరోనా సోకిన వ్యక్తి తుమ్మినా,దగ్గినా ఇతరులకు స్ప్రెడ్ అవుతుంది అని అనుకుంటుండగా అయితే ఇప్పుడు మరో నమ్మలేని నిజం వెల్లడైంది.

 Us Scientists, Corona, Cough, Talking, Face Mask-TeluguStop.com

ఇంతకీ ఆ విషయం ఏమిటంటే ఈ వ్యాధి సోకిన వ్యక్తి తో మాట్లాడినా కూడా ఈ వైరస్ ఇతరులకు అంటుకుంటుందట.యూఎస్ లోని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తల బృందం జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

ఇప్పటివరకు రోగి తుమ్మినా,దగ్గినా మాత్రమే ఇతరులకు వ్యాపిస్తుంది అని అనుకుంటుంటే ఇప్పుడు ఈ తాజా అధ్యయనం తో మాట్లాడినా కూడా ఈ వైరస్ సోకుతుంది అని తేల్చి చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
వ్యాధి సోకిన డాక్టర్ హార్వే ఫినెబర్గ్ అధ్యక్షతన ఓ కమిటీ కరోనా వైరస్ వ్యాప్తి అంశంపై పరిశోధనలు ప్రారంభించగా, కొన్ని రోజులు అధ్యయనం చేసిన తర్వాత ఆ విషయాలను వైట్ హౌజ్‌కు తెలిపింది.

ఈ పరిశోధనలు జరుపగా మాట్లాడినా కూడా వైరస్ సోకే ప్రమాదం ఉందని డాక్టర్ ఫినెబర్గ్ హెచ్చరించారు.అందుకే మాస్క్ అనేది తప్పనిసరి అని, ఏదో ఒక మాస్క్ వేసుకొని బయటకు కాలు పెట్టడం మంచిదంటూ ఫినెబర్గ్ బృందం అభిప్రాయపడింది.

నోరు,ముక్కు, కళ్ల నుంచి నేరుగా ఊపిరితిత్తులకు చేరే ఈ వైరస్‌‌ను అడ్డుకోవాలంటే మాస్క్ ధరించక తప్పదని సూచించారు.

Telugu Corona, Cough, Face-Latest News - Telugu

తుమ్మినా, దగ్గినా, నోటి తుంపరల ద్వారా కూడా ఇది రోగితో మాట్లాడినా కూడా ప్రమాదమేనన్నారు.కరోనా సోకిన రోగికి ఆరు అడుగుల దూరంలో ఉన్న వ్యక్తికి కూడా తుమ్ము లేదా దగ్గు వల్ల వైరస్ వ్యాపిస్తుందనే విషయం కూడా వాస్తవమేనని ఈ బృందం ధృవీకరించినట్లు తెలుస్తుంది.ఈ తాజా అధ్యయనం తో నిజంగా ఈ లాక్ డౌన్ అనేది పాటించి ఇళ్లకే పరిమితం అయితే మాత్రం ఈ వైరస్ సోకకుండా జాగ్రత్త పడొచ్చు అన్న విషయం అర్ధం అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube