ముంబైవాసుల‌ను క‌ఫ్యూజ్ చేస్తున్న క‌రోనా... నిపుణులేమంటున్నారు?

మహారాష్ట్రలో కరోనా మరియు ఒమిక్రాన్ ఇన్‌ఫెక్షన్లు వేగంగా పెరుగుతున్నాయి.రోజుకు 40 వేలకు పైగా కరోనా కేసులు న‌మోద‌వుతున్నాయి.

 Corona Confusing Mumbai Residents Health Doctors People Rain Seasonal Weather ,-TeluguStop.com

వీటిలో సగం అంటే 20 వేలకు పైగా కేసులు ముంబైలో న‌మోద‌వుతున్నాయి.గత నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి కొన‌సాగుతోంది.

మహారాష్ట్రవాసులు అనారోగ్యానికి గురవుతున్నారు.ఇక ముంబై విష‌యానికొస్తే సోమవారం ఒక్కసారిగా ఉష్ణోగ్రత పడిపోయింది.

సోమవారం ముంబైలో ఈ సీజన్‌లో అత్యంత చలి వాతావ‌ర‌ణం నెల‌కొంది.దీంతో ముంబైలో పెద్ద సంఖ్యలో ప్రజలు జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాల‌తో బాధ‌ప‌డుతున్నారు.

ఇవి కరోనా మరియు ఒమిక్రాన్ లక్షణాల‌ను త‌ల‌పిస్తున్నాయి.

కరోనా మూడవ వేవ్‌లో బాధితులు తేలికపాటి లక్షణాలతో బాధ‌ప‌డుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో తమకు ఏమైందోన‌ని ముంబైవాసులు అయోమయంలో పడ్డారు.క‌రోనా టెస్టుల కోసం క్యూ క‌డుతున్నారు.

వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మొదటి రెండవ వేవ్‌తో పోలిస్తే మూడవ వేవ్‌లో శ్వాసకోశ వ్యవస్థను జాగ్ర‌త్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది.ముక్కు, చెవి, గొంతు సంబంధిత సమస్యలు వస్తే కచ్చితంగా వైద్యులను సంప్ర‌దించాల‌ని నిపుణులు చెబుతున్నారు.

కాగా ఇప్పుడు ఢిల్లీ తరహాలో ముంబైలో కూడా కాలుష్యం పెరిగిపోతోంది.ముక్కు, చెవి, గొంతులో సమస్య ఎందుకు వస్తుందో తెలుసుకున్నాక‌నే చికిత్స చేయాల్సి వుంటుంద‌ని వైద్య‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube