ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్‌లో కరోనా కలకలం.. రెండు రోజుల్లో ఎన్ని కేసులంటే.. ?

విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్‌లో కరోనా కలకలాన్ని సృష్టిస్తుంది.ఇక్కడున్న విద్యార్ధుల్లో కొత్తగా 38 మంది ఇంజనీరింగ్‌ విద్యార్థులకు పాజిటివ్‌ నిర్థారణ అవడంతో మిగతా విద్యార్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

 Corona Commotion On Andhra University Campus, Andhra University, Campus, Student-TeluguStop.com

రెండు రోజుల్లోనే 109 మంది కరోనా భారిన పడడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా భయ పడుతున్నారు.ఈ నేపధ్యంలో మరో 400 మంది టెస్ట్‌ రిపోర్ట్‌లు రావాల్సి ఉందని, ఆ రిపోర్ట్స్ వచ్చాక ఇంకా ఎన్ని కేసులు బయటపడతాయో అని భయంతో ఎదురుచూస్తున్నారట.

ఇకపోతే కోవిడ్‌ వ్యాప్తితో ఏయూలోనిం ఇంజనీరింగ్‌ హాస్టళ్ల ప్రాంగణాన్ని ఐసొలేషన్‌ సెంటర్‌గా మార్చారు.ఇలా కరోనా సెకండ్‌ వేవ్‌ వైరస్‌ విజృంభణతో ఏయూ పరిధిలో బీఈ, బీటెక్‌, బీఫార్మసీ పరీక్షలు వాయిదా పడగా, మరోవైపు ఏపీ సెట్‌ సెకండ్‌ ఫేజ్‌ కౌన్సిలింగ్‌ కూడా వాయిదా పడింది.

కాగా విద్యార్ధులు ఎవ్వరూ ఆందోళన చెందవద్దని యూనివర్సిటీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.ఇదిలా ఉండగా విశాఖ జిల్లా వ్యాప్తంగానూ కోవిడ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.జిల్లాలో కొత్తగా 156 మందికి పాజిటివ్‌ నిర్థారణ అయ్యినట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube