సెకండ్ వేవ్‌ లోనూ దేవరకొండ టీమ్ సాయం

కరోనా సెకండ్‌ వేవ్ నేపథ్యంలో సినీ ప్రముఖులు మరియు జనాలు పెద్ద ఎత్తున ఎఫెక్ట్‌ అవుతున్నారు.కరోనా మద్య తరగతి వారిని ఎక్కువగా ఇంపాక్ట్‌ చేస్తుందనే విషయం తెల్సిందే.

 Corona Charity Again Doing Vijay Devarakonda-TeluguStop.com

ఈ సమయంలో కొందరు సినీ ప్రముఖులు తమకు తోచినంతగా సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.గత ఏడాది విజయ్ దేవరకొండ టీమ్ తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రదేశాల్లో సహాయ కార్యక్రమాలు నిర్వహించారు.

ముఖ్యంగా మద్య తరగతి వారికి వీరు చేసిన సహాయం నిలిచి పోతుంది అనడంలో సందేహం లేదు.ప్రస్తుతం మళ్లీ విజయ్‌ దేవరకొండ టీమ్‌ సేవా కార్యక్రమాలు మొదలు పెట్టింది.

 Corona Charity Again Doing Vijay Devarakonda-సెకండ్ వేవ్‌ లోనూ దేవరకొండ టీమ్ సాయం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

విజయ్ దేవరకొండ మరియు ఆయన తమ్ముడు కలిసి మద్య తరగతి వారికి తమ వంతు సాయం అందించేందుకు గాను తమ టీమ్‌ ను రంగంలోకి దించారు.తాజాగా విజయ్‌ దేవరకొండ ఏకంగా వంద కుటుంబాలకు సాయం అందించినట్లుగా తెలుస్తోంది.

విజయ్‌ దేవరకొండ ఆన్ లైన్‌ ద్వారా వచ్చిన రిక్వెస్ట్‌ లకు వెంటనే స్పందిస్తూ వారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు.విజయ్‌ దేవరకొండ మరియు ఆయన సన్నిహితులు కలిసి వందల కుటుంబాలను ఆదుకుంటున్నారు.

ప్రస్తుతం ఉన్న సమస్యలకు పరిస్కారం అన్నట్లుగా వీరి టీమ్ చేస్తున్న సేవ కార్యక్రమాలు చర్చనీయాంశంగా నిలిచాయి.విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం లైగర్‌ సినిమా చేస్తున్నాడు.కరోనా కారణంగా షూటింగ్‌ ను వాయిదా వేశారు.లైగర్‌ సినిమా కు పూరి జగన్నాద్‌ దర్శకత్వం వహించాడు.

అనన్య పాండే హీరోయిన్ గా ఈ సినిమా లో నటిస్తోంది.బాలీవుడ్‌ లో ఈ సినిమా ను విడుదల చేయబోతున్నారు.

తెలుగు మరియు ఇతర భాషల్లో పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు కరణ్‌ జోహార్‌ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నాడు.కరోనా కారణంగా ఈ సినిమా మళ్లీ వాయిదా పడే అవకాశం ఉంది.

.

#Liger #Coraona Help #Purijanath #Liger Team

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు