వైరల్‌ : చైనాలో కరోనా వైరస్‌పై నవ్వు తెప్పిస్తున్న మనోళ్ల కామెంట్స్‌

చైనాలో మొదలైన కరోనా వైరస్‌ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తుంది.ఇప్పటి వరకు చైనాలో 350 మంది మృతి చెందినట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

 Corona Chainis Food Indian Gods-TeluguStop.com

చైనాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా కరోనా వైరస్‌ కారణంగా మరణాలు మొదలయ్యాయి.పిలిపిన్స్‌లో కరోనా వైరస్‌ వల్ల మొదటి మరణం నమోదు అయ్యింది.

చైనాలో కాకుండా బయట దేశంలో మరణాలు మొదలు అవ్వడంతో ప్రపంచం మొత్తం ఆందోళనలో ఉంది.ఈ వైరస్‌కు విరుగుడు లేదా అంటూ జనాలు భయాందోళనల్లో ఉన్నారు.

ప్రస్తుతం చైనాలో ఉన్న పరిస్థితికి వారి ప్రవర్తన, వారి ఆహారపు అలవాట్లు అంటూ ప్రపంచ దేశాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.ఇతర దేశాలతో పోల్చితే చైనీస్‌ ఫుడ్‌ చాలా వింతగా విచిత్రంగా ఉంటుంది.

ముఖ్యంగా వారు తినే కీటకాలు, జంతువులు, ఇంకా రకరకాల జీవులను ఇతర దేశాల వారు కనీసం చూస్తేనే వాంతులు చేసుకుంటారు.చైనాలో పాములు, కప్పలు, పిచ్చి పిచ్చి జంతువులను తింటారు.

కరోనా వైరస్‌కు కారణం పాములు అంటూ శాస్త్రవేత్తలు గుర్తించారు.అంటే చైనా వారు పాములు తినడం వల్ల కరోనా వ్యాపి ప్రారంభం అయ్యిందని అంటున్నారు.

Telugu Chainis, Corona, Indian Gods, Telugu Ups, Whatsappmassage-Latest News - T

ఈ సమయంలోనే ఇండియన్‌ సోషల్‌ మీడియాలో ఒక మెసేజ్‌ తెగ వైరల్‌ అవుతుంది.ఇప్పుడు అది సందర్బం కాకున్నా, పక్క దేశం వారు చాలా బాధల్లో ఉన్నా ఈ మెసేజ్‌ మాత్రం నవ్వు తెప్పిస్తూ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Telugu Chainis, Corona, Indian Gods, Telugu Ups, Whatsappmassage-Latest News - T

ఇంతకు ఆ మెసేజ్‌ ఏంటీ అంటే.చైనాలో కరోనా వైరస్‌ మనుషులను చంపేస్తుంది.ఎందుకంటే వారు పాములను కప్పలను తింటూ ఉంటారు.కాని ఇండియన్స్‌ పాములను పూజిస్తాము కప్పలను ఆధరిస్తాము.కనుక వారికి కరోనా వస్తుంది.మనకు కరోనా వచ్చే అవకాశమే లేదు.

ఈ మెసేజ్‌ పెద్ద ఎత్తున జనాల్లో ప్రాకిపోయింది.వాట్సప్‌ స్టేటస్‌లు మరియు పెద్ద ఎత్తున ఫార్వర్డ్‌ మెసేజ్‌ల రూపంలో వైరల్‌ అవుతున్న విషయం తెల్సిందే.

పక్క దేశం వారు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న సమయంలో వారిపై జోకులు వేయడం ఏమాత్రం కరెక్ట్‌ కాదంటూ కొందరు పాపం అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube